క‌రోనా వైర‌స్ మాన‌వాళి జీవితాన్ని అత‌లాకుత‌లం చేసింది. ఇంటి గుమ్మం దాట‌లంటే ఆలోచించేలా చేస్తోంది. అనేక జాగ్ర‌త్త‌లు పాటించేలా చేస్తోంది. ఎన్నో కొత్త ప‌ద్ధతుల‌కు శ్రీకారం చుట్టేలా చేస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం క్ర‌మంగా లాక్‌డౌన్పై స‌డ‌లింపులు వ‌స్తోంది. క‌రోనాతో స‌హ‌జీవ‌నం త‌ప్ప‌నిస‌రి అయిన మేధావులు, శాస్త్ర‌వేత్త‌లు చెబుతూనే ఉన్నారు. ముందు జాగ్ర‌త్త‌లే వ్యాధి నియంత్ర‌ణ‌కు శ్రీరామ ర‌క్ష‌గా పేర్కొంటున్నారు. అంత‌కుమించిన త‌రుణోపాయం లేద‌ని చెబుతున్నారు. లైఫ్ ఆప్ట‌ర్ క‌రోనాపై మేధావులు, శాస్త్ర‌వేత్తలు, సామాన్యులు ఎవ‌రికి  తోచిన స‌ల‌హా, సూచ‌న‌లు, భావాల‌ను, అభిప్రాయాల‌ను పంచుకుంటున్న విష‌యం తెలిసిందే. 

 

భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్పార‌పు వెంక‌య్య‌నాయుడు కూడా లైఫ్ ఆప్ట‌ర్ క‌రోనాపై త‌న అభిప్రాయాల‌ను తెలియ‌జేశారు. ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న క‌రోనాపై వ‌హించాల్సిన జాగ్ర‌త్త‌లు, ప్ర‌జ‌ల న‌డ‌వ‌డిలో రావాల్సిన మార్పును నొక్కి చెప్పారు. బాధ్యతాయుతంగా ప్రకృతితో కలిసి జీవించేవిధంగా మ‌నుషుల అల‌వాట్లు, న‌డ‌వ‌డిలో, జీవన శైలిలో మార్పుతోనే క‌రోనాను ఎదుర్కొగ‌ల‌మ‌ని చెప్పారు.వాస్త‌వానికి క‌రోనా క‌న్నా అత్యంత భ‌యంక‌ర‌మైన మహమ్మారులు ప్రపంచమానవాళిపై విరుచుకుప‌డ్డాయి. అనేక ప్రాణాల‌ను బ‌లిగొన్నాయి. అప్పుడప్పుడూ ఇలాంటి వ్యాధులు సంక్రమించడం లక్షలాది ప్రాణాలను బలిగొనడం గురించి చరిత్రలో చదివాం...ఇప్పుడు చూస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు.

 

ఇలాంటి ప్ర‌త్యేక వ్యాధులు,ప‌రిస్థితులు మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పాయి. ఇప్పుడు క‌రోనా నుంచి కూడా మాన‌వాళి ఎంతో నేర్చుకుంటోంద‌ని భావిస్తున్నాను. రోజుల వ్య‌వ‌ధిలోనే  ప్రాణాంతక పరిస్థితుల నుంచి బయటపడే జీవన గతిని మార్చుకునేందుకు కొత్త నిర్ణ‌యాల అమ‌లుకు శ్రీకారం చుట్టాయి. భ‌విష్య‌త్ ఉప‌ద్ర‌వాల‌ను ఎదుర్కొనేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌నే చెప్పాలి.  ఇక వైద్య రంగంలో జ‌ర‌గాల్సిన ప‌రిశోధ‌న‌ల వేగం పెరుగుతుంద‌ని నేను భావిస్తున్నా. ఇక  ప్రపంచ ఆరోగ్యసంస్థ అధికారులు చెబుతున్న‌ట్లుగా కరోనా మహమ్మారిని ఒకవేళ మనం అనుకున్నదానికంటే ఎక్కువకాలం పాటు ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తితే మ‌న జీవన విధానంలో మార్పులు చేసుకోవ‌డం త‌ప్పా వేరే మార్గం లేదంటూ పేర్కొన్నారు. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: