మార్చి నెల నుంచి మొదలైన లాక్ డౌన్ మరోసారి పొడిగింపు జరిగింది. ఈ సారి మే 31 వ తారీకు వరకు ఈ కొనసాగింపును కేంద్ర ప్రభుత్వం చేసింది. అయితే ఈసారి మాత్రం కొన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని నిర్ణయాలను వదిలేసింది. ఇక అందులో చూస్తే... ముఖ్యంగా రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ వంటి విషయాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలేసింది. 


దీనితో ఇక రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం కలిగింది. ఇక మన తెలుగు రాష్ట్రమైన ఏపీ ప్రభుత్వం విషయానికి వస్తే... లాక్ డౌన్ 4.0 కు సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యంగా జగన్ ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించినట్లు తెలుస్తోంది. అసలు జగన్ ప్రభుత్వం ప్రస్తుతం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న ఒకసారి చూద్దామా...  బస్సులు కొన్ని ప్రాంతాలలో నడపాలని నిర్ణయం తీసుకుంటాడని తెలుస్తోంది. అదికూడా పలు జాగ్రత్తలు తీసుకోని మాత్రమే నడపబోతుంది. అంతే కాకుండా ప్రతీచోట భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడం. ఇక అలాగే ప్రభుత్వ ఉద్యోగులంతా కార్యాలయాలకు హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వడం. ఇక ఆగిపోయిన పేదల ఇళ్ల స్థలాల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయడం. 


ఇక ఎవరైనా ప్రయాణించేటప్పుడు కార్లలో అయితే గరిష్టంగా ముగ్గురికి మాత్రమే అనుమతి ఇచ్చేవిధంగా చూస్తున్నారు. ఇక అలాగే నగరాలలో దుకాణాల వద్ద ఒకేసమయంలో ఐదుగురు మాత్రమే ఉండేలా పర్మిషన్ ఇస్తున్నారు. ఇకపోతే పెళ్లిళ్లకు గరిష్టంగా 50 మందికి మాత్రమే అనుమతి కలిపిస్తున్నారు. అలాగే రెస్టారెంట్లు వద్ద పార్శిళ్లకు అనుమతిస్తూనే, భౌతికదూరం పాటించేలా చర్యలకు అధికారులు ఉత్తర్వులు ఇస్తున్నారు. ఇక ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే రాత్రి 7 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ  విధించాలని ఆదేశాలు కూడా జారీ చేసారు. అంతేకాకుండా కరోనా లక్షణాలు కలిగిన వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చేలా అవగాహన కలిపించేలా ప్రభుత్వం చర్యలు జారీ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: