తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో అన్ని ఆలయాలు మూతపడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇక కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా దర్శనాలు నిలిపివేశారు. కానీ పూజలు మాత్రం పూజారులు నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా దాదాపు 50 రోజులకు పైగా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి నోచుకోలేక పోయారు సాధారణ భక్తులు. 

IHG

ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణంలో మరోసారి కూడా నిరాశే మిగిలింది అనే చెప్పాలి. దర్శన మార్గమధ్యంలో మార్కింగ్ స్టిక్కర్లు అతికించిచడంతో దర్శనానికి అనుమతి లభిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ మే 31 వరకు పొడిగించడంతో అనుమతి లభించలేదు. దీనితో కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా అప్పటివరకు నిలిపి వేస్తున్నట్లు సమాచారం. 

IHG

అధికార కార్యక్రమాలకు ఇంకా కేంద్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అనుమతి లభించడంతో భక్తులకు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే మహాభాగ్యం ఇప్పటిలో లేదు అన్నట్లే అధికార వర్గాలు తెలియజేస్తున్నారు. ఈ విషయంపై రెండు మూడు రోజులలో అధికారిక ప్రకటన కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

IHG


 ఒకవేళ దర్శనాలకు అనుమతి లభించిన కూడా భక్తులు భౌతిక దూరం పాటించేలాగా రెండు రోజుల కిందటే క్యూలైన్లలో లడ్డు కౌంటర్లలో అధికారులు మార్కింగ్ చేయడం జరిగింది. ఇక ఈ విషయం శ్రీవారి భక్తులకు బాగా నిరాశ కలిగించే విషయమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: