లాక్ డౌన్ 4 నేపథ్యంలో అన్నిరాష్ట్రాలు కేంద్రం ఇచ్చిన మినహాయింపులను అమలు చేయడానికి సిద్దమవుతున్నాయి. అందులో భాగంగా ప్రజా రవాణా పై ప్రత్యేక ద్రుష్టి పెట్టాయి. విమాన, రైళ్ల రాకపోకలపై  ఈనెల 31వరకు నిషేధం కొనసాగనుండగా అంతరాష్ట్ర బస్ సర్వీసులకు మాత్రం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక కేరళ లోనైతే సెలూన్ షాపులు కూడా  తెరుచుకోనున్నాయి అయితే కేవలం హెయిర్ కటింగ్ మాత్రమే చేయించుకోవాలని షేవింగ్ లు, మసాజ్ లు, ఫేషియల్ వంటి వాటికి అనుమతి లేదని కేరళ సర్కార్ వెల్లడించింది అలాగే బ్యూటీ పార్లర్లకు అనుమతిలేదని ప్రతి సెలూన్ షాప్ లో సానిటైజర్ అలాగే మాస్క్ ల వాడకం తప్పనిసరి అని పేర్కొంది. 
 
ఇక ఈరోజు కేరళ లో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 29కేసులు బయటపడ్డాయి అందులో ఒక్క కేసు మినహా మిగితావి అన్ని విదేశాల నుండి  వచ్చిన వారివల్లే రావడం గమనార్హం. ఈకేసుల తో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 630 కు చేరగా అందులో 497 మంది బాధితులు కోలుకోగా ముగ్గురు మరణించారు. ప్రస్తుతం 130 కేసులు యాక్టీవ్ గా ఉన్నాయని సీఎం విజయన్ వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: