కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌పై సీపీఐ త‌న‌దైన శైలిలో స్పందించింది. కోవిడ్ లాక్ ముసుగులో భారతదేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తెగనమ్మడం దుర్మార్గ చర్య అని సిపిఐ నాయకులు మండిపడ్డారు. ప్రధాని రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ అని ఊరించి, చివరకు రూ.3 లక్షల కోట్లే ప్రజలకు ప్రత్యక్షంగా లబ్ది చేకూరేలా వంచించారని విమర్శించారు. డొల్ల ఆర్థిక ప్యాకేజీ, వలస కార్మికుల పట్ల నిర్లక్షానికి వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో దేశ‌వ్యాప్తంగా మంగళవారం నాడు చేపట్లే నిరసనలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మగ్దూంభవన్ సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి venkat REDDY' target='_blank' title='చాడ వెంకట్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>చాడ వెంకట్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 


కరోనా లాక్ డౌన్‌ పేరుతో  ప్రజలందరిని కేంద్ర ప్రభుత్వం ఇంట్లో ఉంచి ఖజానాను కార్పరేట్ సంస్థలకు అప్పజెబుతోందని నారాయణ విమర్శించారు. ప్యాకేజీతో ప్రజలకు ఉపశమనం ఇవ్వకుండా కార్పొరేట్ డెకాయిట్ దోచిపెట్టారని అన్నారు. రక్షణ రంగంలో కూడా 70 శాతం విదేశీ పెట్టుబడులును అనుమతించడం సిగ్గు చేటు అన్నారు. వాయు ర‌వాణ‌, విద్య, బొగ్గు గనులను, ఇలా ప్రతి ఒక్కటి ప్రవేటీకరిస్తున్నామని ప్రకటించారన్నారు. కనీసం క్యాబినెట్, పార్లమెంటులో చర్చించకుండా ఈ నిర్ణయాలు ఎలా తీసుకున్నారని కేంద్ర‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రధాని మోడీ రూ.20లక్షల కోట్లు ప్రకటించి పోయారని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రామాయణం సీరియల్ మాదిరి ఐదు రోజులు దాని గురించి చెప్పుకుంటూ పోయారన్నారు. మొత్తం అయిపోయాక రామాయణంలో రాముడికి సీత అమవుతుందో అర్థం కాని రీతిలో ఆర్థిక ప్యాకేజీ ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలకు, ఇటు రాష్ట్రాలకు నేరుగా డబ్బులు ఇవ్వలేదని, రాష్ట్రాలకు కూడా అప్పు చేసుకునేందుకు ఎఫ్ పరిమితిని ఐదు శాతం పెంచినా అనేక షరతులు విధించారని, ఇది రాష్ట్రాలను అవమన పరచడమేనన్నారు. మానవతా హృదయంతో వలసకార్మికులకు రూ.10వేలు, 20 కిలోల బియ్యం ఇవ్వాలని నారాయ‌ణ‌ డిమాండ్ చేశారు. వలస కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనందుకు ఈ నెల 19న లాక్ డౌన్‌ బద్ధలు కొట్టి నిరసనలు తెలుపుతామని, ఎక్కడ వలస కార్మికులుంటే అక్కడ వారందరినీ సమీకరించి పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలని నారాయణ పిలుపునిచ్చారు. 

 

లాక్ డౌన్‌ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నందున కనీసం కుటుంబానికి రూ.5వేలు చొప్పున రెండు నెలలు ఇచ్చేలా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాలని venkat REDDY' target='_blank' title='చాడ వెంకట్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు వారి నిధి నుండి రూ.5వేలు ఇవ్వాలని, చేనేత, ఇతర వృత్తి దారులను కూడా ఆదుకోవాలని కోరారు. ప్యాకేజీ, వలస కార్మికులను ఆదుకోకపోవడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ శ్రేణులు కంటైన్మెంట్ లేని చోట్ల తహసీల్దారు కార్యాలయాలు, లేబర్ ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బొగ్గు గనులను సైతం ప్రైవేటకీరించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని, సింగరేణి ప్రైవేటు పరం చేసే యత్నాలను వ్యతిరేకిస్తూ ఈనెల 20న సింగరేణి గనులున్న జిల్లాల్లో కార్మికులు చేపట్టే నిరసనలకు సంఘీభావంగా సిపిఐ శ్రేణులు పాల్గొనాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలో కార్పరేట్ అనుకూల, ప్రజల వ్యతిరేక విధానాలనే కొనసాగిస్తూ మరోసారి బిజెపి ప్రభుత్వం తన నైజాన్ని బైట పెట్టుకుందని విమర్శించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: