కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో ప్రపంచం అల్లాడుతోంది. ఆర్థిక రంగాలన్నీ దెబ్బతిన్నాయి. వందలు వేలు, ల‌క్ష‌ల‌ సంఖ్యలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఇక ప్రధానంగా కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అయిన చైనాలో పరిస్థితులు కొంత ఆందోళనకరంగానే ఉన్నాయి. కరోనా వైరస్ మ‌హ‌మ్మారితో పొంచి వున్న‌ ప్రమాదం గురించి ప్రపంచానికి చెప్పకుండా చైనా కావాలనే దాసింద‌ని అంతర్జాతీయంగా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ దేశం నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు అనేక కంపెనీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి.  ఆ దేశం నుంచి విదేశీ కంపెనీలు బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ దేశంలో తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు నిరాకరిస్తున్నాయి. ఈ క్రమంలో తమ పెట్టుబడులకు సురక్షితమైన దేశాలను వెతుక్కుంటున్నారు పెట్టుబడిదారులు. ఇందులో భాగంగా అనేక కంపెనీలు భారతదేశం వైపు చూస్తున్నాయి. భారత్‌లో పెట్టుబడులు పెడితే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదని అంచనా వేస్తున్నాయి.

 

ఇందులో భాగంగానే చైనా నుంచి షూల త‌యారీ కంపెనీ ఆగ్రాలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తోంది. ఈ కంపెనీ సుమారు ఏడాదికి 10 కోట్ల షూలు తయారు చేసే సామర్థ్యం ఉన్న కంపెనీ అని, ప‌దివేల‌మందిక ఉపాధి ల‌భిస్తుంద‌ని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి భారతదేశం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అనేక ఉత్పత్తులు చేపడుతోంది. సొంతంగా రక్షణ రంగం సామాగ్రిని కూడా తయారు చేసుకుంటుంది. చిన్నచిన్న దేశాలకు ఈ సామాగ్రిని అమ్మేందుకు రెడీ అవుతుంది. ఇటీవల మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ నుంచి కూడా భారీ మొత్తంలో సామాగ్రి కొనుగోలుకు ఆర్డర్ వచ్చినట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామాలు భారతదేశం ఎదుగుదలకు ఎంతో దోహద‌ పడతాయని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎంతో మెరుగుపడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ట్రెండు ఇలాగే కొనసాగితే వచ్చే ఐదేళ్లలో భారతదేశం ఆర్థికంగా తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: