ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే 25 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం జగన్ ఉగాది పండుగ రోజునే ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని ప్రయత్నించినా లాక్ డౌన్ వల్ల ఆ పథకం ప్రారంభం కాలేదు. కొన్ని రోజుల క్రితం జగన్ వైయస్సార్ జయంతి సందర్భంగా జులై 8వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది. 
 
అమరావతి, కాకినాడ లాంటి ప్రతాల్లో ఇళ్ల పట్టాల కోసం సేకరించిన భూమి విషయంలో కొన్ని వివాదాలు ఉన్నా మిగతా ప్రాంతాల్లో మాత్రం యథావిధిగా ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన పొరపాటే మరోసారి పునరావృతం అవుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజశేఖర్ రెడ్డి హయాంలో రాజీవ్ గృహకల్ప పేరుతో, అప్పటికే మరో పేరుతో ప్రారంభమైన ఇళ్లను ఇందిరమ్మ గృహాల పేరుతో ప్రజలకు ఇచ్చారు. 
 
2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రాజీవ్ గృహకల్ప ఇళ్లను, రాజీవ్ స్వగృహ ఇళ్లను ఆపేసి ఎన్టీయార్ హౌసింగ్ పేరుతో కొత్త పథకాన్ని మొదలుపెట్టారు. చంద్రబాబు హయాంలో ఆగిపోయిన ఇళ్ల సంగతి పట్టించుకోకుండా జగన్ సర్కార్ కొత్తవాళ్లకు లబ్ధి చేకూరుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఇళ్లు వస్తాయని భావించిన వారు పేర్లు వచ్చినా ఇళ్లకు నిధులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. 
 
జగన్ సర్కార్ వీరికి ప్రయోజనం చేకూర్చే దిశగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వానికి సంబంధించిన ఇళ్ల విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. మరి జగన్ సర్కార్ ఈ సమస్యకు ఎటువంటి పరిష్కారాన్ని చూపిస్తుందో చూడాల్సి ఉంది.               

మరింత సమాచారం తెలుసుకోండి: