కొన్నిరోజుల నుంచి రాజకీయ విమర్శల జోలికి పెద్దగా పోనీ జనసేన అధినేత పవన్ కల్యాణ్...తాజాగా విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అసలు విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనకు సంబంధించిన బాధితులకు జగన్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సాయం చేసింది. చనిపోయినవారికి కోటి సాయం చేసింది. ఇంకా మిగతా వారికి కూడా పెద్ద మొత్తంలోనే సాయం అందించింది.

 

ఇంకా బాధితులు పూర్తిగా కోలుకునేవరకు అండగా ఉండటానికి సిద్ధమైంది. అటు జరిగిన ఘటనపై ఓ కమిటీ వేసి, నిజనిజాలని తేల్చే పనిలో ఉంది. అలాగే అందులో ఉన్న విష వాయువు స్టైరిన్‌ని కూడా తరలించేలా చేశారు. అయితే ఇంత చేసినా సరే టీడీపీ నేతలు విమర్శలు చేస్తూనే వచ్చారు. ఇక తాజాగా పవన్ కల్యాణ్ కూడా ఇదే అంశంపై విమర్శలు మొదలుపెట్టారు.

 

ఎల్జీ పాలిమర్స్ నుంచి విడుదలైన విష వాయువు స్టైరిన్ ప్రజా జీవితంపై దుష్ప్రభావం చూపించిందని, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధిత ప్రజలకు ధైర్యం ఇచ్చేలా లేదని ఆరోపించారు. స్టైరిన్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, విష వాయువు ప్రభావిత ప్రాంత గ్రామాల ప్రజలకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం సక్రమంగా స్పందించకపోతే పోరాడతామని హెచ్చరించారు. లాక్‌డౌన్ అనంతరం ఎల్జీ పాలిమర్స్ ప్రభావిత ప్రజల కోసం.. భవన నిర్మాణ కార్మికుల కోసం చేసిన తరహాలోనే ఉద్యమిస్తామని పవన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.

 

ఇదే సమయంలో టీడీపీ ఎలాంటి విమర్శలు చేస్తుందో, పవన్ కూడా అవే విమర్శలు చేశారు. మిషన్ బిల్డ్ ఏపీ పేరిట భూములు అమ్మి, నవరత్నాలు అమలు చేయాలన్న జగన్ ప్రభుత్వ ఉద్దేశాన్ని కూడా తప్పుబడుతున్నారు. ఇక మద్యం అమ్మకాలు, అధిక విద్యుత్ బిల్లులు, ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు జరిగాయని చెబుతూ...పవన్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే పవన్ పక్కగా బాబు బాటలోనే వెళుతున్నట్లు అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: