కరోనా వైరస్ బయటపడిన వుహాన్ నగరంలో ఇప్పుడు వ్యాపార కార్యకలాపాలు మళ్లీ స్టార్ట్ అయ్యాయి. మూడు నెలల పాటు ఈ నగరంలో లాక్ డౌన్ విధించడంతో ఆటోమొబైల్ మరియు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు కొనుగోళ్లు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. వుహాన్ నగరం ఎలక్ట్రానిక్ మరియు ఆటోమొబైల్ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. గత ఏడాది ఈ నగరంలో 15 లక్షల వాహనాల వరకూ ఉత్పత్తి అయ్యాయి. అయితే ఎప్పుడైతే కరోనా వైరస్ బయటపడిన దాదాపు మూడు నెలల పాటు చైనా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడం జరిగిందో అన్ని స్తంభించిపోయాయి. ఇటువంటి నేపథ్యంలో ఇటీవల చైనా ప్రభుత్వం వుహాన్ నగరంలో మళ్లీ ఉత్పత్తులు కొనుగోలు జరగాలని ఉన్న కంపెనీలను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది.

 

ఈ సందర్భంగా అక్క‌డ త‌యార‌య్యే ఎల‌క్ట్రిక్‌కార్ల కొనుగోలు పై 1000యువాన్ల వ‌ర‌కు స‌బ్సిడీ ఇవ్వ‌డానికి ముందుకు వ‌స్తున్న‌ట్లు అక్క‌డి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. చమురుతో నడిచే కార్లపై 5వేల యువాన్ల సబ్సిడీ ఇస్తామని నగర అధికారులు వుహాన్‌ ప్రజలకు మెసేజ్‌ రూపంలో తెలియజేస్తున్నారు. అంతేకాకుండా వుహాన్  నగరంలో తయారయ్యే ప్రతి ఎలక్ట్రిక్ బోర్డు పైన మరియు ఎయిర్ కండిషనర్ లపై వాటర్ ఫిల్టర్ లపై, రిఫ్రీజిరేటర్లపై సబ్సిడీ పొందవచ్చని చైనా ప్రభుత్వం ప్రకటించింది.

 

అంతకు ముందు మూడు నెలల పాటు రోడ్డుపై ఏది కూడా కనబడని వుహాన్ నగరంలో ప్రస్తుత వ్యాపార లావాదేవీలతో పాటు మరియు ప్రజలు కూడా యధావిధిగా తిరుగుతున్నారు. చాలావరకు కరోనా వైరస్ అదుపులోకి రావటంతో చైనా ప్రభుత్వం ఎక్కడికక్కడ వ్యాపార లావాదేవీలు మొదలుపెట్టింది. ఈ నగరంలో పుట్టిన వైరస్ వల్ల ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 200 దేశాలకు పైగా లాక్‌డౌన్‌లోకి వెళ్ళిపోయాయి. ఈ వైరస్ వల్ల లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయిన దేశాలలో ఆకలి మరియు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వైరస్ పుట్టినిల్లు వుహాన్ లో పరిస్థితి కంట్రోల్ అవటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: