ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కి మందు ఇప్పుడప్పుడే రాదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చేసింది. కరోనా వైరస్ వ్యాక్సిన్ రావటానికి టైం పట్టొచ్చు కానీ లేకపోతే వ్యాక్సిన్ రాకపోవచ్చు కానీ భవిష్యత్తులో బతకాలంటే కరోనా వైరస్ తో బతకాలని తేల్చేసింది. ఇదే సమయంలో చైనా దేశంలో ఈ వైరస్ కొట్టడంతో ఆ వైరస్ కి విరుగుడు వ్యాక్సిన్ను ఎలాగైనా సాధించాలని చైనా శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. అయినా కానీ ఫలితాలు రీసెర్చర్లు అంత ఆశాజనకంగా లేవు. ఇదే సమయంలో అమెరికా మరియు ఇండియా అదేవిధంగా దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, ఇటలీ వంటి ప్రపంచ దేశాలు కూడా వ్యాక్సిన్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు పరిశోధనలు చేస్తున్నారు. వీళ్ళ ప్రయోగాలు బట్టి చూస్తే ఇప్పుడు అప్పుడే వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని అంటున్నారు.

 

ఇదిలావుండగా కరోనా పై ప్రపంచానికి అదిరిపోయే పాయింట్ తో పెద్ద షాక్ ఇచ్చింది చైనా. అదేమిటంటే కొవిడ్-19 తీవ్రంగా ప్ర‌భావిత‌మైన వారిలో దీర్ఘ‌కాలిక ఆరోగ్య స‌మ‌స్య‌లు కొన‌సాగ‌వ‌చ్చ‌ని షాకింగ్ నిజం ఒక‌టి వెల్ల‌డించింది. గుండె, ఊపిరితిత్తులు, ఇత‌ర అంత‌ర్గ‌త అవ‌య‌వాలు దెబ్బ‌తిన‌డం, కుంగుబాటు వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు త‌లెత్తవ‌చ్చ‌ని తెలిపింది.

 

వీట‌న్నింటిని దీర్ఘ కాలిక వ్యాధులుగా గుర్తిస్తూ చైనా ప్ర‌భుత్వం బీమా ఫ‌రిదిలోకి తీసుకువ‌చ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఇదే విషయాన్ని చైనా జాతీయ పత్రిక ఇటీవల ప్రచురించింది. చైనాలో ఇటీవల కరోనా వైరస్ నుండి కోలుకున్న ఆయా వ్యక్తుల అంతర్గత అవయవాల పడుతున్న ప్రభావం బట్టి పెద్దగా ప్రమాదం ఉండదని కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అయిన వారిలో మాత్రం గుండె మరియు ఇతర అవయవాలు దెబ్బ తినే అవకాశం ఉందని చైనా చెప్పుకొచ్చింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: