అందరూ అనుకున్నట్టుగానే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగించింది. 4.0 లాక్ డౌన్ మే 17 నుండి మే 31 వరకు కొనసాగుతుంది అని ప్రకటించింది. దేశంలో వైరస్ ప్రభావం ఉన్న కొద్దీ పెరగటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే నాలుగో దశ లాక్ డౌన్ మినహాయింపులను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక విధంగా చూసుకుంటే దాదాపు చాలా వాటికి మినహాయింపులు చేసినట్లే ప్రకటనలు బట్టి అర్థమవుతుంది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న హాట్ స్పాట్ ప్రాంతాలలోనే ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని అన్నట్టుగా మినహాయింపులు ఉన్నాయి. విమాన సర్వీసులకు మరియు అదేవిధంగా మెట్రో సర్వీసులకు మాత్రం కేంద్రం అనుమతులు ఇవ్వలేదు.

 

అలాగే దేశవ్యాప్తంగా రాత్రి 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు కొనసాగుతుందని లాక్ డౌన్ కొనసాగుతుందని చెప్పింది . జనసాంద్రత ఎక్కువగా ఉండే వ్యాపార స్థలాలకు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, స్కూళ్లు, కళాశాలలు, దేవాలయాలు, ప్రార్థనామందిరాలు, బార్లు, ఆడిటోరియంలకు అనుమతి నిరాకరించింది. ఇక లాక్ డౌన్ నిబంధనలను అమలు చేసే బాధ్యత, సడలింపు అధికారాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకే కట్టబెట్టింది. అదేవిధంగా పెళ్లిళ్లకు 50 మందికి మించి జనాలు ఉండకూడదని ఇక మరణాలకు కూడా 20 మంది నుంచి రాకూడదని అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో మరో పక్క ప్రజా రవాణాను పునరుద్ధరించాలని డిసైడ్ అయ్యింది.

 

బస్సులను రాష్ట్రాలు తమ పరిధిలో నడుపుకునే వెసులుబాటును కల్పించింది. సోషల్ డిస్టెన్స్ మరియు మాస్క్ తప్పనిసరిగా పాటించాలని ఇతర రాష్ట్రాలకు బస్సు నడపాలంటే రెండు రాష్ట్రాలు పరస్పరం చర్చించుకోవాలి అని సూచించింది. ఇదే సమయంలో రాజకీయ, మతపరమైన సభల పై నిషేధం మే 31 వరకు ఉంటుందని కేంద్రం తెలిపింది. మొత్తం మీద ఈ సడలింపులు విని చాలా మంది జనాలు కేంద్రం తాళం విప్పేసి గొళ్లెం పెట్టినట్టు ఉంది అని అంటున్నారు. కొత్త రూల్స్ చాలా వరకు ప్రజలకు ఊరట ఇచ్చినట్లు ఉన్నాయి అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: