కేసీయార్ రాజకీయంగా గండరగండడు. కేవలం రెండు ఎంపీ సీట్లతో తెలంగాణా రాష్ట్రాన్ని తెచ్చిన ఘనుడు. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత మళ్లీ చంద్రబాబుని ఉమ్మడి ఏపీకి సీఎం కానీయనని ప్రతిన చేసిమరీ దాన్ని  నిలబెట్టుకున్న విజేత. ఇలా కేసీయార్ గురించి చాలానే చెప్పుకోవాలి.

 

అటువంటి కేసీయార్ విషయంలో ఒకటికి రెండు సార్లు ఎవరైనా ఆలోచిస్తారు. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం కేసీయార్ కే ఝలక్ ఇచ్చేశారు. ఏకంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని పెంచేసారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి డెడ్ స్టోరేజి వరకూ నీళ్లు తోడేయడానికి కూడా ఏపీ సర్కార్ డిసైడ్ అయినట్లుగా న్యూస్ వస్తోంది.

 

మరి రాయలసీమ నాలుగు జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు దాహం తీరాలంటే క్రిష్ణ నీరుతో గొంతు తడపాల్సిందే. నిజానికి వరద నీరుని పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకుపోవాలన్నది ఆలోచన. అయితే ఆ వరద నీరే కాదు. అసలు నీరే రానీయకుండా ఎగువ రాష్ట్రాలు చేస్తున్నాయి. దాంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

 

నిజానికి కేసీయార్ పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పధకం చేపట్టారు. దాని ద్వారా క్రిష్ణ  నీరుని ఎగువనే వాడేసుకుంటున్నారని ఏపీ సర్కార్ ఆరోపిస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్ వరకూ నీరు రాకుండా చేస్తున్న తెలంగాణా నిబంధనలు, చట్టాలు పక్కన పెడుతోందని అంటున్నారు.

 

దీంతో ఏపీ కూడా తమకు కావాల్సిన నీటిని వాడుకోవడానికి ఇలా చేస్తోందని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో క్రిష్ణా బోర్డుకి తెలంగాణా సర్కార్ క్రిష్ణ నీటిని వాడేసుకునేందుకు చేపడుతున్న ఎత్తిపోతల పధకాలను స్టాప్ చేయించాలని ఏపీ కోరుతోంది. అలా చేస్తే తాము కూడా పోతిరెడ్డిపాడు విషయంలో వెనక్కి తగ్గుతామని అంటోంది.

 

మొత్తానికి అటూ ఇటూ తిరిగి ఇపుడు తెలంగాణా ఎత్తిపోతల పధకాలకే తగులుకుందన్నమాట.   మరి దీని మీద కేసీయార్ వెనక్కి తగ్గితేనే జగన్ కూడా తగ్గుతారని అంటున్నారు.చూడలి మరి ఈ యుధ్ధం ఎలా ముగుస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: