హైదరాబాద్ లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో  లాక్ డౌన్  కఠినతరంగా మారింది. అయినా కూడా ప్రజలు ఇళ్ల నుంచి  బయటకు వస్తున్నారు. దాంతో ప్రజలు ఎక్కువగా మంది కరోనా బారిన పడుతున్నారు. అంతేకాకుండా కొంతమంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇకపోతే హైదరాబాద్ లో వాహనాల రద్దీ తగ్గిన కూడా యాసిడెంట్స్ జరుగుతున్నాయి. తాజాగా మరో యాక్సిడెంట్ జరిగింది. స్కూటిలో వెళుతున్న వ్యక్తి ని లారీ డీ కొట్టడంతో వ్యక్తి ప్రాణాలను అక్కడిక్కడే వదిలేసాడు. ప్రస్తుతం ఈ ఘటన తెలంగాణ పోలీసులకు తలా నొప్పిగా మారింది.. 

 

 

 

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో 50 రోజులకు పైగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పటిష్టంగా అమలు చేయడంతో నేరాలు, రోడ్డుప్రమాదాలు గణనీయంగా తగ్గుముఖం పడ్డాయి. అయితే ఇటీవల కొన్ని సడలింపులు ఇవ్వడంతో ప్రజలు వాహనాలతో బయటకు వస్తున్నారు. దీంతో రోడ్డుప్రమాదాల సంఖ్య పెరిగింది. 

 

 


తాజాగా హైదరాబాద్‌ లోని ప్రధాన ప్రాంతమై న ఖైరతాబాద్ ‌లో ఓ వ్యక్తి లారీ చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు.ఈరోజు సాయంత్రం ఖైరతాబాద్ చౌరస్తా వద్ద అతివేగం గా వచ్చిన ఓ భారీ లారీ బీభత్సం సృష్టించింది. ముందు స్కూటీ పై వెళ్తున్న ఓ వ్యక్తి ని ఢీకొట్టింది. అదుపు తప్పిన అతడు వెనుక చక్రాల కింద పడి నలిగి పోయాడు. తీవ్ర రక్త స్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి కి సంబంధించిన వివరాల కోసం ఆరా తీస్తున్నారు. అలాగే పోలీసులు లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దీంతో కాసేపు ఖైరతాబాద్  రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: