ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న  నేపథ్యంలో ఈ మహమ్మారి వైరస్ కు విరుగుడు కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు ఎన్నో పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ వెలుగులోకి వచ్చి  నెలలు గడుస్తున్నా.. ఈ వైరస్ కి వాక్సిన్  కనుగొనేందుకు ఎన్నో పరిశోధనలు జరిగినా ఏ ఒకటి  సక్సెస్ మాత్రం కాలేకపోయింది. అయితే ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు వైరస్  కనుగొనడం కోసం. పలు చోట్ల ఈ వ్యాక్సిన్ కు సంబంధించి పరిశోధనలు చివరిదశలో కూడా ఉన్న విషయం తెలిసిందే, 

 

 

 అమెరికా బ్రిటన్ దేశాల్లో  అయితే ఈ మహమ్మారి వైరస్ వాక్సిన్  కనుగొనేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక తాజాగా లండన్కు చెందినటువంటి సిగరెట్ తయారీ కంపెనీ అయినా బ్రిటిష్ అమెరికన్ టొబాకో కరోనా  వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది తాజాగా. ఈ కంపెనీ అమెరికా కొలాబరేషన్ తో  నడుస్తూ ఉంటుంది. అంటే వీళ్లు పొగాకు ద్వారా కరోనా  వైరస్ కు విరుగుడు కనుగొన్నామంటూ  ప్రకటించారు. ల్యాబ్ లో చేసినటువంటి ప్రీ క్లినికల్ ప్రయోగాలు అన్నీ సక్సెస్ అయ్యాయి అంటూ తెలిపారు అక్కడ నిపుణులు. 

 


 ఇక జూన్ చివర్లో ఈ టొబాకో వ్యాక్సిన్ మనుషుల మీద కూడా ప్రయోగం చేస్తామంటూ  వెల్లడించారు. కరోనా  వైరస్ ల్యాబ్ లో తయారు చేసి దానిని యాంటీ జెనీస్ అభివృద్ధి చేశాము  అన్నటువంటి బ్రిటిష్ టొబాకో కంపెనీ చెబుతోంది. యాంటీ జెనీస్  పొగాకు మొక్కల్లో కి పంపించి  అవి పెరిగిన తర్వాత.. వీరిపై ఆంటీ జెనీస్  తయారు అయ్యాయి అన్నది నిపుణులు చెబుతున్నారు. ఇక దీని ద్వారా అభివృద్ధి చేసినటువంటి విరుగుడు కరోనా ను ఎదుర్కొనే   వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వగలుగుతుంది అని ప్రాథమిక అంచనాలో తేలింది చెప్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే పొగాకు వాడకం ఒక్కసారిగా పెరిగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: