మే 31 వరకూ లాక్ డౌన్ పొడిగించినా.. ఇక దాని ప్రభావం నామమాత్రమే కానుంది. ఆర్టీసీ బస్సులు సహా అన్నింటికీ పర్మిషన్లు ఇచ్చేయడంతో ఇక లాక్ డౌన్ అన్నది నామ్ కే వాస్తే గా మారిపోయింది. చివరకు ఆర్టీసీ బస్సులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మంగళవారం ఉదయం నుంచే తెలంగాణలో ఆర్టీసీ బస్సులు పరుగులు పెట్టబోతుంటే.. ఆంధ్రప్రదేశ్ లోనూ బస్సులు సర్వీసుల కోసం రెడీ అవుతున్నాయి.

 

 

తెలంగాణలో ఆర్టీసీ బస్సులు మంగళవారం నుంచి నడవబోతున్నా.. హైదరాబాద్ లో మాత్రం అప్పుడే తిరిగే అవకాశం లేదు. అంతే కాదు.. బస్ లలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం, ఏభై శాతం కెపాసిటీతోనే నడపడం, శానిటైజర్ లు వాడడం తదితర చర్యలు తీసుకుని బస్ లను నడిపేందుకు సర్కారు ఓకె చెప్పింది. అంతేకాదు.. హైదరాబాద్ లో బస్సులు నడవకపోయినా.. జిల్లాల నుంచి హైదరాబాద్ కు బస్సులు నడుస్తాయి.

 

 

అయితే అవి శివార్ల వరకూ మాత్రమే నడుస్తాయి. అటు జూబ్లీ బస్టాండు వరకూ బస్సులను అనుమతిస్తారు. సిటీలోకి రానివ్వరు. హైదరాబాద్ లో బస్ లు నడపడానికి ఇంకా టైమ్ పట్టవచ్చు. ఇక ఏపీలోనూ బస్సులు సర్వీసుల కోసం రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారిని స్వరాష్ట్రానికి తీసుకొచ్చే అంశంపై ఏపీ దృష్టి సారించింది. ముఖ్యంగా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నుంచి తొలుత ఆర్టీసీ బస్సులు నడుస్తాయి.

 

 

అయితే.. ఇవి నాన్ స్టాప్ సర్వీసులుగా నడుస్తాయి. మధ్యలో ఎక్కడా ప్రయాణికులను ఎక్కించుకోవడం, దింపకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బస్సుల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేందుకు సగం సీట్లతోనే బస్సులు నడపాలని నిర్ణయించారు. ప్రైవేటు బస్సులు, రాష్ట్రంలో బస్సుల తిప్పే అంశంపై కూడా మూడు నాలుగు రోజుల్లో విధివిధానాలు వెలువడే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: