వైయస్ జగన్ పై పెట్టిన అక్రమ ఆస్తుల కేసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైం లో సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన లక్ష్మీనారాయణ కీలకంగా వ్యవహరించారు. జగన్ కేసులను టేకప్ చేయడంతో లక్ష్మీనారాయణ పేరు అప్పట్లో మీడియాలో మారుమ్రోగింది. జగన్ కేసులకు సంబంధించి లీకులు మీడియాకి ఇవ్వటంలో లక్ష్మీనారాయణ కీలకంగా వ్యవహరించారని ఆయన కాల్ డేటా బయటపడటం అందరికీ విస్మయానికి గురి చేసింది. ఆ తర్వాత ఆయన మహారాష్ట్ర కి రాజీనామా ఓటమి తర్వాత ఆయన పదవికి రాజీనామా చేసి 2019 ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరారు ఈ విషయం మనకందరికీ తెలిసిందే.

 

జనసేన పార్టీలో చేరి విశాఖపట్టణం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి లక్ష్మీనారాయణ ఓడిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో మళ్లీ అడుగు పెట్టడంతో పవన్ వ్యవహారంపై విసుగుచెంది లేఖ రాసి జనసేన పార్టీకి రాజీనామా చేసి సైలెంట్ గా ఇంటికి పరిమితం అయ్యారు. ఇటువంటి తరుణంలో ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ నిర్ణయాలను సమర్థిస్తూ లక్ష్మీనారాయణ పొగిడారు. జగన్ మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను అమలు చేస్తున్నారని, మేనిఫెస్టో లో ఉన్న విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు.

 

అలాగే ఆయన అక్రమాస్తుల కేసుకు సంబంధించి కేవలం ఒక ఉద్యోగిగా మాత్రమే డ్యూటీ చేసినట్టు చెప్పుకొచ్చారు. అయితే ఎక్కువ లక్ష్మీనారాయణ వ్యవహారం చూస్తే వైసీపీ పార్టీలో చేరడానికి ఆయన ఇష్టంగా మాట్లాడుతున్నట్లు అర్థమవుతుంది. గతంలో కూడా ఈ ఇంటర్వ్యూ కి ముందు రైతులకు వేతనాలకు సంబంధించి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని బహిరంగంగా పొగిడాడు. అదే సమయంలో కరోనా వైరస్ జస్ట్ జ్వరం లాంటిది అని జగన్ చేసిన వ్యాఖ్యలను కూడా సమర్ధించారు. జేడీ లక్ష్మీనారాయణ వ్యవహారం చూస్తుంటే ఆయన పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే అంతా ఓకే అయినా, ఆయన పార్టీలో కనుక అడుగుపెడితే ఆయన అంటే ఇష్టం లేనివాళ్లు చాలా మంది వైకాపాలో ఉన్నారు. వారు ఊరుకోరు .. జగన్ మీద రివర్స్ అవ్వచ్చు అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: