ఆంధ్ర రాజకీయాల్లో గత కొన్ని రోజుల నుంచి డాక్టర్ సుధాకర్ అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాను  పనిచేసే ప్రభుత్వ ఆస్పత్రిలో మాస్కులు పిపిఈ కిట్లు లేవు అని జగన్ సర్కార్ పై ఆరోపణలు చేయడం... అంతే కాకుండా మరిన్ని విషయాలలో ఏకంగా  ముఖ్యమంత్రిని బండ బూతులు తిట్టడంతో అతని ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. అయినప్పటికీ అతని తీరు మాత్రం మార్చుకోలేదు. అయితే ప్రస్తుతం అతని మానసిక స్థితి సరిగాలేదని వైద్యులు అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక సుధాకర్  అధికార పార్టీపై విమర్శలు చేస్తుండడంతో అతని అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

 


 అయితే డాక్టర్ సుధాకర్ గతంలో  ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించి భంగపడ్డారు  . కానీ ఎమ్మెల్యే టికెట్ మాత్రం లభించలేదు. అయితే ప్రస్తుతం టిడిపి పార్టీ  డాక్టర్ సుధాకర్ కి ఫుల్ సపోర్ట్ చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా  డాక్టర్ సుధాకర్ మీడియా ముందు ఒకలాగా మామూలుగా అందరి ముందు ఒకలాగా మాట్లాడుతున్నారు. అయితే తాజాగా సుధాకర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తనకు ఇంకా ఐదు సంవత్సరాలు సమయం ఉందని... అందుకే ప్రజలు నాయకులు అందరూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తన ఉద్యోగం తనకు  వచ్చేలా చేయాలని కోరారు. 

 


 తన ఐదు సంవత్సరాల కాలానికి ఉపయోగించుకోవాలి అని అంటున్నారు డాక్టర్ సుధాకర్. అయితే డాక్టర్ సుధాకర్  ఇచ్చిన స్టేట్ మెంట్ పై అటు  విశ్లేషకులు ఏమంటున్నారు అంటే.. వైద్యుడిగా మళ్ళీ సుధాకర్ కి ఉద్యోగం కల్పిస్తే మంచిదే కానీ... డాక్టర్ సుధాకర్ కి ఎంతో కోపం... గతంలో వివాదాలు కూడా ఉన్నాయని... అంతేకాకుండా ప్రస్తుతం మానసిక స్థితి సరిగా లేదు అని ఆరోపణలు కూడా వస్తున్నాయి అని అంటున్నారు విశ్లేషకులు. వైద్య వృత్తి అంటే ప్రజల ప్రాణాలు డాక్టర్లు చేతిలో ఉంటాయి కాబట్టి.. సహనం  లేకుండా ఉన్న డాక్టర్ సుధాకర్ కు మానసికంగా చికిత్స అందించి వైద్యుడిగా కాకుండా ఏదైనా పర్యవేక్షణ అధికారి గా ఉద్యోగం కల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: