గత కొద్ది రోజులుగా తెలంగాణలో పుంజుకున్న కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో రోజు కూడా పదుల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూశాయి. సోమవారం రాష్ట్రంలో కొత్తగా 41 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1592కు చేరుకుంది. కొత్తగా నిర్ధారణ అయిన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 26 కేసులు ఉండగా.. మేడ్చల్ జిల్లాలో 3 నమోదయ్యాయి.

 

సోమవారం మొత్తంగా 10 మంది డిశ్చార్జి అయ్యారు. తద్వారా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1002కి చేరింది. ప్రస్తుతం 556 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక మరణాల సంఖ్య 34 కాగా, కొత్త మరణాలేవీ చోటు చేసుకోలేదు. వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

 

మరో 26 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఐతే రాష్ట్రంలో GHMCతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి చేరుకున్న తెలంగాణ వలస కార్మికుల నుంచే కొత్త కేసులు నమోదవుతున్నాయి

 

గత వారం అంతా తెలంగాణలో కేవలం పది లోపల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒక్కసారిగా ఇలా ఎక్కువ కేసులు నమోదు కావడానికి జిహెచ్ఎంసి పరిధిలోని వైరస్ వ్యాప్తిని ప్రభుత్వం సరిగా చేయలేకపోవడం మరియు పక్క రాష్ట్రాల నుండి తరలివస్తున్న వలస కార్మికులలపై ప్రత్యేక శ్రద్ధ చూపించకపోవడం అని పలు విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్యం వీడి సక్రమమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకా విషమంగా మారే అవకాశం ఉంటుంది అని విశ్లేషకుల అంచనా.

 

ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే కొత్తగా 5వేల పైచిలుకు కేసులు నమోదు కావడంతో టోటల్ ట్యాలీ 1లక్ష దాటేసింది. అందులో 39వేల మంది వ్యాధి నుంచి కోలుకోగా, 3,155 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతానికి యాక్టివ్ కేసుల సంఖ్య 58 వేలుగా ఉంది. అంకెల విషయంలో రోజుకో రికార్డు చెరిగిపోతుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: