రాష్ట్రవ్యాప్తంగా మరో 52 పాజిటివ్ కేసులు నమోదైనట్లు బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో 15 చొప్పున.. నెల్లూరు జిల్లా 7, తూర్పుగోదావరి జిల్లా 5, కర్నూలు జిల్లా 4.. కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో రెండేసి చొప్పున.. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది.

 

చెన్నై కోయంబేడు మార్కెట్ ఎఫెక్ట్చిత్తూరు, నెల్లూరు జిల్లాలపై కొనసాగుతోంది. తమిళనాడుతో సరిహద్దులను పంచుకుంటోన్న రెండు జిల్లాలకు చెందిన చిరు వ్యాపారులు హోల్‌సేల్‌గా నిత్యావసర సరుకులు, వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేయడానికి కోయంబేడు మార్కెట్‌కు వెళ్లొస్తుంటారు.

 

తాజా కేసులు కలిపితే మొత్తం సంఖ్య 2282కు చేరగా.. డిశ్చార్జ్ అయిన వారు కాకుండా యాక్టివ్ కేసులు 705గా ఉన్నాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో 'కరోనా వైరస్' కోరలు చాస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొన్నటికి మొన్న 25 కొత్త కేసులు నమోదయ్యాయి. కానీ నిన్నటికి  పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ రెట్టింపైంది. దీంతో ఏపీలో ఆందోళన పెరుగుతోంది.

 

ప్రభుత్వం తాజాగా 9713 శాంపిల్స్‌ని టెస్ట్ చెయ్యగా... 52 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. దాంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2282కి చేరింది. ఐతే... వీటిలో 1527 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మృతుల సంఖ్య 50గా ఉంది

 

పొరుగు రాష్ట్రల నుంచి స్వస్థలానికి చేరుకున్న వారిలో 150 మంది ఇప్పటిదాకా వైరస్ బారిన పడ్డారు. ఇందులో మహారాష్ట్ర వాటా అధికంగా ఉంది. మహారాష్ట్ర నుంచి స్వస్థలానికి చేరుకున్న వారిలో 101 మంది కరోనాకు గురయ్యారుగుజరాత్ నుంచి వచ్చిన 26 మంది, రాజస్థాన్ నుంచి స్వస్థలానికి చేరుకున్న వారిలో 11 మందికి కరోనా వైరస్ సోకింది. కర్ణాటక, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వారిలో ఒక్కొక్కరు వైరస్ చికిత్స పొందుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: