దేశంలో కరోనా మహమ్మారి ఎప్పుడైతే  ప్రారంభం అయ్యిందో అప్పటి నుంచి సంపన్నులకు, ఎగువ మద్య తరగతి వాళ్లకు తప్ప పేద ప్రజలకు, చిరు ఉద్యోగులు, వ్యాపారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.  ఇక కరోనా వైరస్.. లాక్ డౌన్ ఎఫెక్ట్ ఎక్కువగా వలస కూలీలపై పడింది.  దేశానికి కార్మిక లోకం ఎంతో ముఖ్యం అంటారు.. కట్టడాలకు వలస కూలీలే దిక్కు అన్న విషయం తెలిసిందే.  ఈ మద్య వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లి పోవొచ్చు అని కేంద్రం వెల్లడించింది.  దాంతో ఎవరి సౌలభ్యం కద్ది వారు ప్రయాణాలు మొదలు పెట్టారు.  ఈ నేపథ్యంలో ఎంతో మంది పాపం కాలినడకన తమ గమ్యస్థానాలు చేరుకుంటున్నారు.  ఈ మద్య ఓ బాలుడు తన తల్లిదండ్రులను రిక్షాలో కూర్చోబెట్టుకొని మూడు వందల కిలోమీటర్లు తొక్కాడు.  ఇలా ఎన్నో వలస కష్టాలు ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం.

 

తాజాగా  ఢిల్లీ నుంచి ముగ్గురు వ్యక్తులు ఒకే రిక్షాలో 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీహార్‌కు బయలుదేరడం చూసిన వారి హృదయాలను చిదిమేస్తోంది. బీహార్‌లోని ఖగారియా జిల్లాకు చెందిన రంజిత్ కుమార్ అందరిలాగే పనుల కోసం ఢిల్లీ వచ్చాడు. లాక్‌డౌన్ కారణంగా చిక్కుకుపోయాడు. దీంతో సొంత రాష్ట్రానికి వెళ్లిపోవాలని భావించిన రంజిత్ మరో ఇద్దరు వలస కూలీలు అజయ్ కుమార్, గుడ్డూలతో కలిసి రిక్షాపై మండుటెండలో ఖగారియాకు బయలుదేరాడు.  

 

అలా రిక్షా కంటిన్యూగా తొక్కుతూ.. ఐదు రోజుల తర్వాత వీరు లక్నో చేరుకున్నారు. అక్కడి నుంచి వారు చేరుకోవాల్సిన గమ్యం మరో 700 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రైవేట్ వాహనాలు అడిగితే 5 నుంచి 10 వేలు అడుగుతున్నారని వాపోయాడు. ఒకరి తర్వాత ఒకరం రిక్షా తొక్కుతూ సొంత రాష్ట్రానికి వెళ్తున్నట్టు అజయ్ కుమార్ చెప్పాడు. తాను ఢిల్లీ నుంచి కాలినడకన బయలుదేరి 120 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత మార్గమధ్యంలో రంజిత్ కుమార్, గుడ్డూలు రిక్షాలో కనిపించారని, తనది కూడా బీహారేనని చెప్పడంతో వారితో కలిసి ప్రయాణించేందుకు అంగీకరించారని అజయ్ కుమార్ వివరించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: