రాయ‌ల‌సీమ‌లో నిన్న మొన్న‌టి వ‌ర‌కు బీసీలు టీడీపీకి అండ‌గా ఉంటూ వ‌స్తున్నారు. ఆ మాట‌కు వ‌స్తే వీళ్లంతా ఇప్ప‌ట‌కీ ఎన్టీఆర్ నుంచి ఫ‌లాలు పొంద‌డంతో ఆయ‌న మొఖం చూసిన ఓట్లేసిన వాళ్లే అనుకోవాలి. ఇక ఎన్టీఆర్ ఎంతో మంది బీసీల‌కు రాజ‌కీయంగా జ‌న్మ‌నిచ్చారు. ఇక పార్టీ ఓడిపోఇయ‌న 2004, 2009 ఎన్నిక‌ల‌తో పాటు పార్టీ గెలిచిన 2014 ఎన్నికల్లో సీమ జిల్లాల్లో ఏదో కొన్ని సీట్లు అయినా టీడీపీకి ద‌క్కాయి. అయితే చంద్ర‌బాబు గ‌త ఐదేళ్ల పాల‌న‌లో ప్ర‌జ‌లు విసిగిపోయారు. అందుకే గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు స‌రైన గుణ‌పాఠం చెప్పారు. కేవ‌లం మూడు సీట్ల‌తో టీడీపీ స‌రిపెట్టుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

 

ఇక చంద్ర‌బాబుకే కాదు జ‌న‌సేన కు కూడా సీమ‌లో ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీకీ సీమ మొత్తం మీద ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా రాలేదు. ఇక టీడీపీ, జ‌న‌సేన‌కు మరీ మూడు సీట్లు, సున్నా సీట్లు అనేవి మాత్రం పూర్తి స్థాయి తిర‌స్కారానికి కార‌ణాలే అని చెప్పాలి. ఈ ఇద్ద‌రు నేత‌ల‌ను రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు పూర్తిగా తిర‌స్క‌రించేశారు. ఇక మంగ‌ళ‌గిరిలో లోకేష్ ఓడిపోయాడ‌న్న‌ది ప‌క్క‌న పెడితే ఇటు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలోనే చంద్ర‌బాబు ముక్కీ మూలిగి గెలిచినా.. మెజార్టీ బాగా త‌గ్గిపోయింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో లోకేష్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కుప్పంలో పోటీ చేసినా గెలుపు క‌ష్ట‌మే అనుకోవాలి.

 

ఇక తాజాగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేట‌రీ సామ‌ర్థ్యాన్ని పెంచాలంటూ ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం సీమ ప్ర‌జ‌ల‌కు చాలా ఉప‌యోగ‌క‌ర‌మైన‌ది. దీనిపై అటు టీడీపీ కాని.. చంద్ర‌బాబు గాని.. ప‌వ‌న్ కాని మాట్లాడ‌డం లేదు. అంటే వీళ్ల‌కు సీమ ప్ర‌జ‌లు బాగుప‌డ‌డ‌డం ఇష్టం లేదా ?  లేదా ఏపీ ప్ర‌యోజ‌నాలు పట్ట‌వా ? అన్న‌ది వారే ఆలోచించుకోవాలి. మాట మాట్లాడితే జ‌గ‌న్‌ను.. వైసీపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించే ఈ నేత‌ల‌కు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు నోరు ఎందుకు పెగ‌ల‌డం లేదో ? అర్థం కావ‌డం లేదు. ఇక ఇప్ప‌టికే సీమ ప్ర‌జ‌లు వీరిని పూర్తిగా తిర‌స్క‌రించేయ‌గా.. ఇకపై సీమ‌లో ఈ ఇద్ద‌రు నేత‌ల‌కు ఇక్క‌డ నూక‌లు చెల్లే ప‌రిస్థితి లేద‌ని వారి అంత‌ర్గ‌త చ‌ర్చల్లోనే చెపుతున్నారు.

  

మరింత సమాచారం తెలుసుకోండి: