సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ కాంగ్రెస్ ప్ర‌భుత్వ పాల‌న‌లో ఆ పార్టీ పెద్ద‌ల ఆదేశాల మేర‌కు ఇప్ప‌టి సీఎం జ‌గ‌న్‌పై ఓ రేంజ్‌లో రెచ్చిపోయే వారు. జ‌గ‌న్ పై ప‌దే ప‌దే ఎటాక్‌లు చేయ‌డంలో జేడీ ఆరితేరిపోయారు. జ‌గ‌న్ కేసుల విష‌యంలో జేడీ మీడియాలో మామూలుగా హైలెట్ కాలేదు. అలాంటి జేడీ గ‌త ఎన్నిక‌ల‌కు కొద్ది రోజుల ముందే త‌న ప‌ద‌వీ కాలాన్ని స్వ‌చ్ఛందంగా వ‌దులుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. అయితే అప్ప‌టికి ఆయ‌న ప‌ద‌వీ కాలం ఎంతో లేదు.. దీనిపై కూడా ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డిచాయి. జేడీ బీజేపీలోకి వెళ‌తార‌ని అంద‌రూ అనుకున్న టైంలో ఆయ‌న షాక్ ఇచ్చి జ‌న‌సేన‌లో చేరి వైజాగ్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

 

ఇక ఆ త‌ర్వాత ప‌వ‌న్ తో విబేధించి బ‌య‌ట‌కు వ‌చ్చిన జేడీ ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు చేశారు. కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉంటోన్న జేడీ త‌న తాజా ఇంట‌ర్వ్యూలో ఏపీలో జ‌గ‌న్ పాల‌పై చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఇంత సంక్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో కూడా ఏపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయ‌ని... జ‌గ‌న్ త‌న మేనిఫొస్టోలో ప్ర‌క‌టించిన ప్ర‌తి ఒక్క అంశాన్ని వ‌ద‌ల‌కుండా దృష్టి పెడుతున్నార‌ని కొనియాడారు. చాలా మంది నాయ‌కులు మేనిఫొస్టోలో మాట‌ల గార‌డీ మ‌త్ర‌మే చేస్తార‌ని.. కానీ జ‌గ‌న్ మాత్రం ప్ర‌తి ఒక్క అంశంపై దృష్టి పెడుతున్నారంటూ ఆకాశానికి ఎత్తేశారు.

 

ఇక జ‌గ‌న్‌పై తాను గ‌తంలో వ్య‌వ‌హ‌రించిన తీరును ప్ర‌స్తావించిన ఆయ‌న తాను కేవ‌లం త‌న విధులు మాత్ర‌మే నిర్వ‌హించాన‌ని.. అంతే కాని త‌న‌కు వ్య‌క్తిగ‌త ద్వేషం... క‌క్ష లేవ‌ని చెప్పారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ తాను ఎద‌రు ప‌డిన‌ప్పుడు న‌మ‌స్కారం.. ప్ర‌తి న‌మ‌స్కారాలు చేసుకున్న విష‌యాన్ని కూడా ఆయ‌న గుర్తు చేశారు. ఇక జ‌గ‌న్ పాల‌న యేడాది పూర్త‌వ్వ‌గానే తాను మార్కులు వేస్తాన‌ని కూడా జేడీ చెప్పారు. ఇక జ‌న‌సేన‌ను వీడ‌డంపై ఆయ‌న స్పందిస్తూ తాను ఫుల్ టైం రాజ‌కీయాల్లోకి వ‌స్తే.. ప‌వ‌న్‌లో ప‌రిప‌క్వ‌త లేద‌ని అందుకే ఆ పార్టీని వీడాన‌ని చెప్పారు. ఏదేమైనా జేడీ ఆలోచ‌న‌లు ఎలా ఉన్నా ?  ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో వైసీపీలో కొంద‌రు నేత‌లు జేడీని పార్టీలో చేర్చుకునేందుకు సుముఖంగా లేన‌ట్టు భోగ‌ట్టా.. మ‌రి జ‌గ‌న్ డెసిష‌న్ ఎలా ఉంటుందో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: