తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు చేయూతనిచ్చే విధంగా ప్రవేశపెట్టిన పథకం రైతు బంధు. రైతుబంధు అనే పథకం ద్వారా రాష్ట్రంలోని రైతుల అందరికీ ప్రతి పంటకు ఐదువేల రూపాయలు పెట్టుబడి సాయం అందించే విధంగా నిర్ణయించింది కేసీఆర్ సర్కార్. ఇప్పటివరకు చాలా మంది రైతులు రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందారు కూడా. అయితే తాజాగా రైతుబంధు విషయంలో కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం ప్రభుత్వం సూచించిన పంట వేసిన రైతులకు మాత్రమే రైతుబంధు సొమ్ము జమ అవుతుంది అంటూ చెప్పుకొచ్చింది సర్కార్. 

 


 ప్రభుత్వం సూచించినప్పటికీ ప్రభుత్వ సూచనలను బేఖాతరు చేస్తూ ఇష్టమైన పంట  వస్తే వారికి మాత్రం రైతుబంధు రాదు అంటూ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఖరీఫ్లో మక్కా పంట వేయొద్దని... ప్రభుత్వ ఆదేశాలను కాదని ఎవరైనా మొక్క పంటను సాగు చేస్తే రైతు బంధు ఇవ్వము అంటూ స్పష్టం చేశారు కేసీఆర్. వాన కాలంలో మొక్కజొన్న పంట వేయకూడదు అంటూ రైతులను కోరిన ముఖ్యమంత్రి కేసీఆర్... వరి పంట విషయంలో కూడా ప్రభుత్వం చెప్పిన వరి వంగడాలను మాత్రమే సాగు చేయాలని సూచించారు. అలా చేస్తేనే  రైతులకు రైతుబంధు సాయం అందుతుంది అంటూ స్పష్టం చేశారు. 

 

 రాష్ట్రంలో ఏ రైతు ఎలాంటి పంట సాగు చేస్తున్నాడు అనే విషయాలు పూర్తిగా సేకరించిన తర్వాత నే రైతు బంధు రైతుల ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు. రైతాంగం నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాలని... తెలంగాణ రాష్ట్రాన్ని అభ్యుదయ వ్యవసాయ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి  అంటూ పిలుపునిచ్చారు. నెల రోజుల పాటు పరిశోధనలు సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్... శాస్త్రవేత్తలు రైస్ మిల్లర్లు అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. ఇష్టం వచ్చిన పంటలు వేసి రైతులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. కేవలం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను  మాత్రమే వేసుకోవాలని... రైతులు తమ తలరాతను తామే మార్చుకునేలా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది అంటూ తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. రైతాంగాన్ని అభివృద్ధి పరిచి అప్పులేని రైతులను  చూసేందుకు  ప్రభుత్వం తపన పడుతుంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: