మెగా బ్రదర్ జనసేన నేత నాగబాబు సోషల్ మీడియా వేదికగా  ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతు ఉంటారు అనే  విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన చేసే వ్యాఖ్యలు పెట్టే ట్విట్లు  ఎప్పుడూ సంచలనం సృష్టిస్తూ ఉంటుంది. అందుకే తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు మెగా బ్రదర్ నాగబాబు. ఎప్పుడూ ఎవరో ఒకరి పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు. ఇక  తమ్ముడు పవన్ కళ్యాణ్ పై ఎవరైనా విమర్శలు చేసిన వారిపై విరుచుకు పడుతూ విమర్శలు చేస్తూ ఉంటారు మెగా బ్రదర్ నాగబాబు. ఇక తాజాగా మరోసారి మెగా బ్రదర్ నాగబాబు పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 

 

 ఇంతకీ ఈ సారి ఎవరి గురించి మాట్లాడారు అంటారా... ఈసారి నాగబాబు మాట్లాడింది మహాత్మా గాంధీని చంపిన నాథురం గాడ్సే గురించి. ఈరోజు నాథురం గాడ్సే పుట్టినరోజు సందర్భంగా.. నాథురం గాడ్సే ను  గుర్తుచేసుకుంటూ నాగబాబు పలు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు నాథూరామ్ గాడ్సే పుట్టినరోజు... నాథురం గాడ్సే నిజమైన దేశభక్తుడు... గాంధీ ని చంపడం కరెక్టా కాదా అన్న విషయం పక్కన పెడితే... నాథురం గాడ్సే వైపు ఉన్న ఆర్గ్యుమెంట్స్ మాత్రం ఎవ్వరూ ఆ రోజుల్లో వినలేదు. అటు మీడియా కూడా ఎక్కడా తెరమీద చెప్పలేదు. కేవలం అప్పటి అధికార ప్రభుత్వానికి లోబడి మాత్రమే మీడియా పని చేసింది. ప్రస్తుతం ఈ రోజుల్లో కూడా మీడియా సంస్థలు అలాగే ఉన్నాయి అన్నట్లుగా వ్యాఖ్యానించారు నాగబాబు. 

 


 గాంధీ ని చంపితే అపఖ్యాతిపాలు అవుతారని నాథురం గాడ్సే కి తెలిసినప్పటికీ కూడా  అనుకున్నది మాత్రం చేసేసాడు అంటూ చెప్పాడు నాగబాబు. గాంధీని చంపినప్పటికీ నాథూరామ్ గాడ్సే దేశభక్తిని మాత్రం శంకించలేము అంటూ తెలిపాడు. నాథురం గాడ్సే ఒక నిజమైన దేశభక్తుడు... ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒకసారి నాథురం గాడ్సే ని గుర్తు చేసుకోవాలి అనిపించింది... పాపం నాథురం గాడ్సే... అతని ఆత్మకు శాంతి చేకూరాలి గాక అంటూ మెగాబ్రదర్ జనసేన నేత నాగబాబు  సోషల్ మీడియా లో టైట్  పెట్టారు  ప్రస్తుతం దీనికి సంబందించి ట్విట్  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: