ప్రస్తుతం ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్నది  మహమ్మారి కరోనా  వైరస్. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వైరస్ కేసులు ఏకంగా 40 లక్షలు దాటిపోయాయి. ఇక మన భారతదేశంలో కూడా ఏకంగా లక్ష దాటిపోయింది ఈ మహమ్మారి కేసుల సంఖ్య. అయితే ఈ ప్రాణాంతకమైన కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఈ మహమ్మారి వైరస్ కు విరుగుడు మాత్రం లభించలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఎక్కడ సత్ఫలితాలు మాత్రం రావడం లేదు. దీంతో రోజు రోజుకు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

 

 ఎంతోమంది ప్రాణాంతకమైన మహమ్మారి వైరస్ తో పోరాడలేక మృత్యుఒడిలోకి ఒదుగుతున్నారు. ఇక అటు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా కష్టాల్లోకి  పోతున్నాయి. ఇక కొన్ని కొన్ని దేశాల అధ్యక్షులు అయితే ఈ మహమ్మారి వైరస్ ను కంట్రోల్ చేయడం తమ వల్ల కాదు అంటూ చేతులెత్తేసారు కూడా. ఇదిలా ఉంటే ఈ మహమ్మారి వైరస్ కు సంబంధించిన వ్యాక్సిన్ గురించి పలు దేశాలు వ్యాక్సిన్ కనుగొన్నామని... ట్రయల్స్ జరుగుతున్నాయని ప్రజల్లో ఆశ కలిగించినప్పటికీ అది కాస్త నిరాశ గా మారిపోతుంది. 

 

 అయితే తాజాగా ఎట్టకేలకు కరోనా  వైరస్కు వాక్సిన్ కనుగొనబడింది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ గడగడలాడిస్తున్న ఈ మహమ్మారి వైరస్ కు విరుగుడు కనుగొనడంలో భాగంగా తాజాగా అమెరికాలోని ఓ పరిశోధన విజయవంతమైంది. అమెరికాకు చెందిన ఓ బయోటెక్ కంపెనీ ఎంఆర్ఎన్ఎ-1273 పేరు తో సరికొత్తగా కరోనా వైరస్ వ్యాక్సిన్ ని తయారుచేసింది. ఇక మొదటి దశలో భాగంగా మనుషుల మీద ఈ ప్రయోగాలు చేయగా విజయం సాధించింది. అంటే మరి కొద్ది రోజుల్లో కరోనా  వైరస్ కి వ్యాక్సిన్ రానున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ మహమ్మారి వైరస్ కు చెక్ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: