ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారికి బ్రేకులు వేసేందుకు అనేక దేశాల్లో జ‌ర‌గ‌ని ప్ర‌యోగాలు అంటూ లేవు. తాజాగా క‌రోనాకు తాము డ్ర‌గ్‌ను డ‌వ‌ల‌ప్ చేశామ‌ని చైనా శాస్త్ర‌వేత్త‌లు చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌పంచ మాన‌వాళికి స‌రికొత్త ఉత్సాహం ఇచ్చింది. ఇప్ప‌టికే క‌రోనా మ‌హ‌మ్మారి భారీన ప‌డి ల‌క్ష‌ల మంది చ‌నిపోతున్నారు. అనేక దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు అన్ని అతలా కుత‌లం అవుతున్నాయి. ఇక క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు భారీ ఎత్తున ప్ర‌యోగాలు కూడా జ‌రుగుతున్నాయి. ఇక ఇప్ప‌ట్లో ఈ వైర‌స్‌కు మందు రాద‌ని చెపుతోన్న వారు మాత్రం రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచు కోవాల‌ని స‌ల‌హాలు, సూచ‌న‌లు చేస్తున్నారు.

 

ఇక కొన్ని ప్ర‌యోగాలు ఫెయిల్ అయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.. మ‌రి కొంద‌రు మాత్రం ఎలుక‌లు.. పిల్లులు. కుక్క‌ల‌పై క‌రోనా వ్యాక్సిన్ ప్ర‌యోగాలు చేస్తున్నామ‌ని చెపుతున్నారు. ఇక తాజాగా క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు తాము డ్ర‌గ్ డ‌వ‌ల‌ప్ చేసిన‌ట్టు చైనీస్‌ లాబొరేటరీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. తాము తయారుచేసిన డ్రగ్ కు మ‌నిషి శరీరంలో ఉన్న క‌రోనా వైర‌స్ కంట్రోల్ అవ్వ‌డంతో పాటు రోగ నిరోధ‌క శ‌క్తి కూడా కంట్రోల్ అవుతుంద‌ని వారు చెపుతున్నారు. ఇక ఈ ప‌రిశోధ‌న‌లో ఉన్న మ‌రో విశేషం ఏంటంటే చైనా ప‌రిశోధ‌కులు ద్రవరూపంలో కాకుండా టాబ్లెట్‌ రూపంలో కోవిడ్‌కు మందు కనిపెట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

 

ఇప్ప‌టికే ఈ ప్ర‌యోగాలు విజయ వంత‌మైన‌ట్టు వారు చెపుతున్నారు. క‌రోనా రోగానికి గురైన ఎలుక‌ల‌పై చేసిన ఈ ప‌రిశోధ‌న‌ల్లో  ఐదు రోజుల తర్వాత దానిలో వైరస్‌ ప్రభావం 2500 యూనిట్లకు పడిపోయింది. కాబట్టి ఈ డ్రగ్‌ను కరోనా చికిత్స విధానంలో ఉపయోగించుకోవచ్చ‌ని నిర్దార‌ణ‌కు వ‌చ్చారు. ఇక ఈ మందును ఇప్ప‌టికే ట్ర‌య‌ల్స్ కంప్లీట్ చేసి త్వ‌ర‌లోనే అందుబాటులోకి తీసుకు వ‌స్తామ‌ని ప్ర‌క‌టించారు.  ఏదేమైనా వ్యాక్సిన్ లేకుండానే క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు మందు క‌నుగోవ‌డం అంటే అది ప్ర‌పంచ మాన‌వాళికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: