ఇప్పటివరకు మనం ఎన్నో రకాలుగా కరోనా వ్యాప్తి చెందుతుందో అన్ని విషయాల గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం కొన్ని జాగ్రత్తలు అనగా, మనిషి మనిషి భౌతిక దూరం పాటిస్తూ, చేతులను మాటిమాటికి శుభ్రం చేసుకుంటూ, మొహానికి మాస్క్ వేసుకొంటే కొద్ది వరకు దీనిని నివారిస్తూ వచ్చాము. ముఖ్యంగా కరోనాను అదుపు చేయడానికి దాదాపు యాభై రోజుల వరకు అందరూ వారి ఇంటికే పరిమితమయ్యారు కూడా. ఇక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులను ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

IHG


ఇది అంతా బాగున్నా ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఒక భయం కలిగేలా ఈ విషయాన్ని వెల్లడించారు. ఎవరైనా గట్టిగా అరిచినా, బిగ్గరగా మాట్లాడిన కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందట. అలా మాట్లాడటం వల్ల వాటి నోటి నుంచి బయటికి వచ్చిన సూక్ష్మజీవులు కారణంగా అవి ఏకంగా 14 నిమిషాలు బయట జీవించగలనని శాస్త్రవేత్తలు వారి పరిశోధనల ద్వారా తెలిపారు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాటి నుంచి వచ్చే సూక్ష్మ నీటి బిందువుల నుండి గాలి లోకి చేరి అవి కరోనా వైరస్ వ్యాప్తి చెందేగా మారుతుందని వారు తెలిపారు. 


ఇలా బయటకు వచ్చిన కరోనా వైరస్ దాదాపు 14 నిమిషాల వరకు జీవించి ఉంటుందని అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు దీన్ని తెలిపారు. ఒక లేజర్ లైట్ ఉపయోగించి కరోనా వైరస్ సోకిన వ్యక్తి మాట్లాడేటప్పుడు నోటి నుంచి ఎన్ని తుంపర్లు బయటికి వచ్చాయి లెక్కవేసి కంటే ఎక్కువ నీటి తుంపర్లు అందులోంచి విడుదలయ్యాయి అని వారు తేల్చారు. కాబట్టి దీని కోసం ఎవరైనా మాట్లాడేటప్పుడు మాస్క్ పెట్టుకొని మాట్లాడితే ఉత్తమమని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుందో మనం నిజానికి.

మరింత సమాచారం తెలుసుకోండి: