దేశంలో కరోనా కేసులు ప్రతిరోజూ పెరిగిపోతున్నాయి.  ఈ నేనథ్యంలో మార్చి 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఎవరు ఇంటి నుంచి బయటకు రావడానికి వీల్లేదని.. అత్యవసర పనులపై తప్ప బయటకు ఎవరూ రావొద్దని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దాంతో లాక్ డౌన్ ఉల్లంఘించి బయటకు వచ్చిన వారు నానా రకాల కారణాలు చెబుతున్నారు. ఈ మద్య లాక్ డౌన్ సడలింపు చేయడంతో కేసులు మరింత పెరిగిపోతున్నాయి.. ప్రతి ఒక్కరూ పోలీసులకు విచిత్రమైన సమాధానాలు చెబుతూ తప్పించుకుంటున్నారు.  కొన్ని చోట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. అత్యవసరం ఉన్నవారిని వదిలివేస్తున్నారు. ఆ మద్య పుదుచ్చేరిలోఓ వ్యక్తి పోలీసులను చూసి మాస్క్ కి బదులు తాను కొన్న చికెన్ బిల్ ని మూతికి పెట్టుకోవడంతో... పోలీసులు షాక్ తిని రూ.100 ఫైన్ వేసి పంపించిన విషయం తెలిసిందే.

 

ఇక దేశ వ్యాప్తంగా మాస్క్ తప్పని సరి అయ్యింది.. తెలంగాణలో అయితే మాస్క్ ధరించకుంటే వెయ్యి రూపాయలు ఫైన్ అని సీరియస్ గా చెబుతున్నారు.  తాజాగా ఓ వలస కూలీ తన దగ్గర మాస్క్ కొనేందుకు కూడా డబ్బులు లేకా ఇబ్బంది పడ్డాడు. తాను బయటకు వచ్చినపుడు పోలీసులు ఎదురు పడ్డారు..  ఏం చేయాలో తోచక జేబులోంచి టక్కున పది రూపాయల నోటు తీసి, మూతికి అంటించుకున్నాడు. ఈ క్రియేటివిటీకి పోలీసులు మైండ్ బ్లాకైంది.

 

అయితే ఆ ఇద్దరు యువకులను పోలీసులు మందలించడంతో.. తమ కష్టాలు పోలీసుల ముందు ఉంచారు.  మాస్క్ లు అధిక ధరలకు అమ్ముతున్నారని.. తమ వద్ద అంత డబ్బులేక భయంతో ఇలా చేశామని చెప్పారు.  పోలీసులు వారి మాట విన్న తర్వాత చలించిపోయి ఇద్దరి మాస్క్ లు ఇచ్చారు..కానీ రూల్ బ్రేక్ చేసినందుకు మాత్రం కేసు పెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: