విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన  ఎంత సంచలనం  సృష్టించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడి  చుట్టుపక్కల  గ్రామాలను అతలాకుతలం చేసింది. ఎల్జి పాలిమర్స్ కంపెనీ నుండి విషవాయు విడుదల కావడంతో పక్కల గ్రామాల ప్రజలు అందరూ ఒక్కసారిగా ఎక్కడికక్కడ కుప్పకూలిపోయారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్  కంపెనీ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో ఈ కేసు విచారణకు రాగా... ఈ గ్యాస్ లీకేజీ ఘటనలో 50 కోట్లు తక్షణం డిపాజిట్ చేయాలని తీర్పునిచ్చింది. 

 


 ఇక ఈ తీర్పును సవాలు చేస్తూ ఎల్జి పాలిమర్స్ కంపెనీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే తాజాగా దీనిపై విచారణ చేసిన సుప్రీం కోర్టు ముందుగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ తర్వాత సుప్రీంకోర్టు విచారణ ఉంటుందని స్పష్టం చేసింది. సుమోటోగా విచారణకు చేపట్టే అధికారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి  లేదు అంటూ ఎల్జీ పాలిమర్స్ వాదించగా ఆ వాదనలను... నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు ప్రస్తావించాలి అంటూ సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది. 

 


 అయితే తమ వాదనను వినకుండానే ఏకపక్షంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది అంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ ఎల్జీ పాలిమర్ కంపెనీకి మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది అని  అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ జూన్ 8కి వాయిదా వేసింది. అయితే ఈ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలతో పాటు బాధిత కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు... వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న వారికి పది లక్షలు... రెండు మూడు రోజులు చికిత్స అవసరం ఉన్నవారికి లక్ష రూపాయలు... గ్రామాలలోని ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు... పశువులను పోగొట్టుకున్న వారికి 20000 అందజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: