ప్రపంచ దేశాలను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భారత్ లో గత రెండు రోజుల నుంచి 5,000కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ చైనాలోని వుహాన్ లో పుట్టిందనే సంగతి అందరికీ తెలిసిందే. 
 
అయితే డెయిలీ మిర్రర్ అనే పత్రిక కరోనా వైరస్ పుట్టుక గురించి సంచలనాత్మక కథనం ప్రచురించింది. ఈ పత్రిక కరోనా వైరస్ వుహాన్ లోని మాంసం దుకాణం నుంచి రాలేదనే అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. డెయిలీ మిర్రర్ తన కథనంలో కరోనా వైరస్ జంతువుల నుంచి వ్యాపించలేదని పేర్కొంది. మనుషుల ద్వారా కరోనా జంతువులకు వ్యాప్తి చెందుతుంది కానీ జంతువుల ద్వారా మనుషులకు వ్యాపించదని డెయిలీ మిర్రర్ చెబుతోంది. 
 
ఆ పత్రిక ఈ వైరస్ మనిషి నుంచి ఈ వైరస్ జంతువులకు సోకి మనుషులకు వ్యాప్తి చెంది ఉండవచ్చు కానీ జంతువుల నుంచి మనుషులకు సోకే అవకాశమే లేదని పేర్కొంది. ఇప్పటికీ కరోనా వైరస్ పుట్టుక గురించి అనేక సందేహాలు నెలకొన్నాయి. చైనా ప్రయోగించిన జీవాయుధం కరోనా వైరస్ అని పలు దేశాలు ఆరోపణలు చేస్తున్నాయి. శాస్త్రవేత్తలు కరోనా వైరస్ పుట్టుక గురించి పరిశోధనలు చేస్తున్నారు 
 
మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,011,39కు చేరింది. దేశవ్యాప్తంగా 3,163 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. ఇప్పటివరకు 39,174 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 57 కరోనా కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 2,339కు చేరింది. గడచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందటంతో మృతుల సంఖ్య 52కు చేరింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: