మనిషి జీవితం గాలిలో బుడగ వంటిది.. బ్రతికి ఉన్నప్పుడే బంధాలు, ప్రేమలు.. మరణించాక అవి కూడా ఈ పంచభూతాల్లో కలిసి పోతాయి.. ఇవన్ని తెలిసిన మనిషి తనలోని ఆశ చంపుకోలేక ఇంకా ఏదో కావాలని ప్రాకులాడుతుంటాడు.. ఇకపోతే నాటి రోజుల్లో మన చుట్టూ ఉన్నవారు ఎవరైనా చనిపోతే, వారి కుటుంబాన్ని అందురూ ఎంతో ఓదార్చి, తమవంతు సాయాన్ని అందించి వారికి బాసటగా నిలిచేవారు. నేటి పరిస్థితి అలా లేదు. ఎందుకంటే రోజులు మారాయి.. మనిషి లైప్ స్టైల్ కూడా మారింది.. దీనికి తోడు మనుషుల ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి..

 

 

నాటికాలంలో మన చుట్టూ ఉన్న వారిలో ఎవరికైనా, ఏదైనా కష్టం వస్తే దానిని తీర్చడానికి అందరూ కలిసి తమవంతుగా సహాయం చేసేవారు.. అలా ఆ కాలం మనుషులకు అందరు మనవారే అనే భావన ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు.. స్వార్ధం.. మనిషిని పూర్తిగా కప్పేసింది.. నేను, నాది అనే మాయలో పూర్తిగా కూరుకు పోయాడు.. ఇకపోతే ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా రావడం వల్ల ముఖ్యంగా వలస కూలీలు క్షణం క్షణం చావుకు దగ్గరగా బ్రతుకుతున్నారు.. ఇదిలా ఉండగా, శనివారం యూపీలో ఆరారియాలో జరగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను ఎర్రటి ఎండలో టార్పాటిలిన్ షీట్లు చుట్టి తరలిచించారు. క్షతగాత్రులను గొర్రెల మందలా ట్రక్కుల్లో కూరి పంపించారు..

 

 

ఒక మనిషి ప్రాణానికి ఎలాంటి విలువ ఉందో ఈ సమాజంలో అర్ధం కాదు.. కానీ మరణించినాక అతను ఎలాంటి వారైనా కనీసం అతని పార్ధీవ దేహానికి విలువ ఇవ్వాలనేది మనిషిగా పుట్టిన ప్రతివారి సంస్కారం.. ఇకపోతే సమాజంలో మనుషుల పట్ల బతికి ఉన్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు కొందరు.. డబ్బులున్న వారే మనుషులుగా, పేదవారు కానట్లుగా ప్రవర్తిస్తున్నారు.. ఇదిలా ఉండగా ఈ విషయంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ దీనిపై ఘాటుగా స్పందించారు. తమ రాష్ట్రానికి చెందిన కూలీల భౌతిక కాయాలను తగిన విధంగా తరలించాలని, తమ సరిహద్దుకు చేరిస్తే గౌరవంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని యూపీ, బిహార్ సీఎంలను కోరారు..

మరింత సమాచారం తెలుసుకోండి: