ప్రపంచం మొత్తం కరోనా కష్టాల్లో ఉంది. చిన్న దేశం పెద్ద దేశం అనే భేదాలే లేవు అన్ని దేశాల్లో ఈ కరోనా ప్రభావంతో అల్లకల్లోలంగా మారింది.  మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు.  ప్రతిరోజే వేలల్లో కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా లాక్ డౌన్ సడలింపు చేసినప్పటి నుంచి తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న వలస కూలీల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. వీరిని అక్కడక్కడ పోలీసులు ఆపుతున్నారని.. వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని కొన్ని వార్తలో వస్తున్నాయి. కానీ పోలీసులు కఠినాత్ములు కాదు.. మనసున్న మహరాజులు అన్న సంఘటన వెలుగులోకి వచ్చింది.

 

ఎన్నో సార్లు పోలీసులు తమ మానవత్వంతో ప్రజల మనసులు గెలుచుకున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కి ఎందరో పోలీసులు ఉదాహరణగా నిలిచారు. తాజాగా ఢిల్లీ పోలీసులు మరోసారి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఓ వృద్ధురాలి మృతదేహాన్ని పోలీసు కానిస్టేబుళ్లు భుజాలపై శ్మశానవాటికకు తీసుకువచ్చి అంత్యక్రియలు జరిపించారు. ఈ ఘటన ఢిల్లీలోని జైత్‌పూర్ లో జరిగింది. జైత్‌పూర్ ప్రాంతానికి చెందిన సింగ్, సుధా కశ్యప్ లు భార్యాభర్తలు. వారికి 26 ఏళ్ల కుమారుడున్నా, అతను మానసిక దివ్యాంగుడు. మంచాన పడిన సుధా మరణించడంతో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేయాలనుకున్నారు.

 

కరోనా ప్రబలుతుందనే భయంతో ఎవరూ ముందుకు రాలేదు. ఎంతో మందిని ప్రాదేయ పడ్డా ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది.. దాంతో తన పరిస్థితి గురించి పోలీసులకు విన్నవించుకోవాలని ఆలోచించాడు.  దీంతో సింగ్ వినతి మేర నలుగురు పోలీసు కానిస్టేబుళ్లు ముందుకు  వచ్చి వృద్ధురాలి మృతదేహానికి అంత్యక్రియలు జరిపించేశారు. పోలీసులు చేసిన పనికి ఇప్పుడు యావత్ భారత దేశం సాహూ అంటుంది. ఇంత కష్టకాలంలో పోలీసులు మంచి మనసు చాటుకున్నారని అంటున్నారు. ఇది కదా ఫ్రెండ్లీ పోలీస్ అని మెచ్చుకుంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: