భారతదేశంలో అన్ని కులాలకు, అన్ని మతాలకు సమ ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ ఎవరూ ఎక్కువ కాదు... ఎవరూ తక్కువ కాదు. అయితే దేశంలో కొందరు హిందువులు కొలిచే దేవుళ్లపై విమర్శలు చేసి ఫేమస్ అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వారిలో కొందరు మేధావులుగా మరికొందరు నాస్తికులుగా గుర్తింపు పొందుతూ ఉంటారు. కొందరు గుర్తింపు కోసమే దేవుళ్లపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. 
 
దేశంలోని హిందూ దేవుళ్లలో అయ్యప్ప స్వామి ఒకరు. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి ఆలయానికి కోట్ల సంఖ్యలో భక్తులు చేరుకుని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో నాస్తికులు, ఉద్యమాల ద్వారా ప్రచారం పొందాలనుకునేవాళ్లు దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియా ద్వారా పాపులర్ కావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా అయ్యయప్పస్వామి విషయం విమర్శలు చేసిన వారి ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
గతంలో అయ్యప్ప స్వామిపై వ్యాఖ్యలు చేసిన బి.ఎస్.ఎన్.ఎల్ ఉద్యోగి అయిన రెహనా ఫాతిమా కొన్ని రోజుల క్రితం ఉద్యోగం నుంచి తొలగించబడింది. రెహానా ఫాతిమా అయ్యప్ప స్వామి బట్టలు వేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో గతంలో ఆమెపై కేసు నమోదైంది. సివిల్ సప్లై ఉద్యోగి కనకదుర్గ కూడా అయ్యప్ప స్వామి గుడిలోకి ఎంట్రీ కోసం ప్రయత్నం చేసి వార్తల్లో నిలవగా ఆమెను తరవాత కాలంలో ప్రజలు పట్టించుకోలేదు. 
 
ఆమెను ఇంటికి అత్తగారు రానివ్వకపోవడం... భర్త విడాకులివ్వడం జరిగింది. కనకదుర్గతో పాటు శబరిమలలోకి ఎంట్రీ ఇచ్చిన లాయర్ బిందు అమ్మణి లా కాలేజీలో ప్రస్తుతం పాఠాలు చెబుతోంది. ఆమెకు అక్కడ సరైన ఆదరణ లేదని తెలుస్తోంది. కళ్యాణి అనే మరో మహిళ ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా అయ్యప్ప స్వామిని దూషించిన వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. వీళ్లు అయ్యప్ప స్వామిని దూషించడం వల్ల ఏం సాధించారనే ప్రశ్న వ్యక్తమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: