ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టాలని అనుకున్నాడో ఏమో.. లేదా తనకు బెయిల్ ఇచ్చిన పుణ్యానికి వారి గుర్తుండిపోయేలా ఏదోఒకటి చేయాలని అనుకున్నాడో ఏమో కానీ ఓ దొంగ చేసిన పనికి ఇప్పుడు కోర్టు సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.  ఈ ఘటన పాకిస్తాన్‌లో చోటు చేసుకుంది. ఓ దొంత తాను చాలా కష్టాల్లో ఉన్నానని... దీనంగా ప్రాధేయ పడ్డాడు.. దాంతో ఆ దొంగ మీద కోర్టు కనికరం చూపి బెయిల్ ఇచ్చింది. అంతే ఆ మరుక్షణమే సదరు దొంగ తన బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు. ఏకంగా కోర్టు ఆవరణలో ఉన్న బైకునే ఎత్తుకెళ్లి సంచలనం సృష్టించాడు.  కరాచీలోని సింధ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దొంగతనం కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు.

 

తాజాగా అతను విచారణ నిమిత్తం కోర్టులో హాజరయ్యాడు. పలుమార్లు విచారించిన న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఇక నుంచి సమాజంలో బుద్దిగా ఉండాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపించారు. కానీ, వారి అంచనాలను ఒక్కసారిగా తలకిందులు చేసి అతను కోర్టు ఆవరణలో పార్క్ చేసి ఉన్న బైకును ఎత్తుకెళ్లిపోయాడు. సదరు దొంగ మాత్రం అబ్బే మీరెన్ని చెప్పినా నా పద్దతి నా పద్దతే అంటూ కోర్టు ఆవరణలో ఉన్న ఓ బైకును తన దొంగ టెక్నాలజీ ఉపయోగంచి ఎత్తుకెళ్లాడు.  నీకు జైలే కరెక్ట్ అని భావించిన  పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు.

 

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.  సాధారణంగా ఇలాంటి దొంగల విషయంలో పోలీసుల చాలా సమయస్ఫూర్తిగా ఉంటారు.. కానీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పోనీ బుద్ది తెచ్చుకుంటాడని భావించారు. తాజాగా  ‘బెయిల్ ఇచ్చినందుకు కోర్టుకు ఆ విధంగా కృతజ్ఞతలు తెలిపాడు’ అని ఓ నెటిజన్ నవ్వుల ఎమోజీని పంచుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: