దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంస్తున్న తరుణంలో కూడా చంద్రబాబు రాజకీయాలను వదిలిపెట్టడం లేదు. వైసీపీ కాకినాడలోని మడ అడవుల దగ్గర పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంపై గతంలో విమర్శలు చేసింది. వైసీపీ అడవుల్ని నాశనం చేస్తోందని... పర్యావరణాన్ని దెబ్బ తీసిందని టీడీపీ విమర్శలు చేసింది. 
 
ఈ మడ అడవుల భూముల గురించి హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కానీ అసలు నిజం ఏమిటంటే ప్రభుత్వం కేటాయించిన భూములకు, మడ అడవులకు ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వం కేటాయించిన భూములకు, మడ అడవులకు మధ్య ఏడెనిమిది కిలోమీటర్ల దూరం ఉంది. టీడీపీ వైసీపీపై లేనిపోని ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తోంది. ఇళ్ల కోసం జగన్ చేస్తున్న ప్రయత్నం నఛ్చకపోవడం వల్లే చంద్రబాబు అడుగడునా జగన్ కు అడ్డు పడే ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
అయితే తాజాగా చంద్రబాబు తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డాడని తెలుస్తోంది. జనసేన పార్టీ మొదట మడ అడవుల సమస్యకు ప్రచారం కల్పించగా టీడీపీ ఆ ఇష్యూను సీరియస్ గా తీసుకుంది. అయితే ప్రభుత్వం కేటాయించిన భూమి మడ అడవి స్వభావం ఉన్నా ప్రభుత్వ రికార్డుల్లో ఖాళీ భూమిగా పేర్కొనడంతో ప్రభుత్వ వాదనే నెగ్గే అవకాశం ఉంది. 
 
రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 89 ఎకరాల భూమిని మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ కు కేటాయించింది. ఇప్పుడు జగన్ సర్కార్ టీడీపీ ఇచ్చిన 89 ఎకరాల స్థలం పక్కనే ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉండటంతో చంద్రబాబుకు షాక్ తగిలే అవకాశం ఉంది. 10,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే కోర్టు కూడా అభ్యంతరం తెలిపే అవకాశం తక్కువ. చంద్రబాబు మడ అడవుల వల్ల తాను తవ్వుకున్న గోతిలో తానే పడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: