ఒకవైపు దేశంలో లాక్ డౌన్ జరుగుతుండగా దీంతో అనేక మంది ఉపాధి కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా వలస కార్మికులు పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వారు అటు వారి సొంత ఊర్లకు వెళ్ళలేక, ఇక్కడ ఉండి పనులు చేసుకోలేక, తినడానికి తిండి లేక అనేక అవస్థలు పడుతూ ఇబ్బందులు పడుతున్నారు. వీటికి తోడు వీరు ఉండే ఇంటి యజమానులు బాగుగా డబ్బులు కట్టాలి అంటూ వారిని సతాయించడం ఎక్కువ అయింది.

 

ఇలాంటి సంఘటనే ఒకటి ఇంటి యజమాని కట్టాలంటూ వేధించడంతో ఒక వలస కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న దారుణమైన సంఘటన ఢిల్లీలో చోటు చేసుకోవడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే... ఒరిస్సాకు చెందిన ఒక వ్యక్తి 30 సంవత్సరాల కిందట గురుగ్రామ్ కు వలసగా వెళ్ళాడు. అక్కడ సెక్టర్ 11 ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ తన జీవనం కొనసాగిస్తున్నాడు. ఇక లాక్ డౌన్  కారణంగా ఉపాధి లేక పోవడంతో 6000 రూపాయలు అద్దె కట్టలేక పోయాడు. అలాగే గతంలో కూడా యజమానికి కొంత బాకీ ఉన్నాడు. మొత్తం 30 వేల దాకా యజమానికి ఇవ్వాలి.. 


ఇక యజమాని వెంటనే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేయడం మొదలు పెట్టడం జరిగింది. ఇక ఆ వలస కార్మికుడు యజమాని వేధింపులు తట్టుకోలేక గత రాత్రి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఉదయం పక్కింటి వ్యక్తి వచ్చి చూడడంతో విషయం బయటకు రావడం జరిగింది. యజమాని వేధింపుల కారణంగానే వలస కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడు అని పోలీసు అధికారులు వాళ్ల భావనను తెలుపుతున్నారు. ఇక ఈ విషయం ఒడిస్సా లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు రాలేము అని తెలిపారు. మా ఏరియాలో కంటోన్మెంట్ లో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మేము అక్కడికి రాలేము అని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇక వారు అంత్యక్రియలకు అయ్యే ఖర్చు కూడా మేము భరించలేని స్థితిలో ఉన్నాము. శవాన్ని మార్చురీలో కుటుంబ సభ్యులు భద్రపరచాలని కోరినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: