అటువైపు నలభై సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం.. ఇటు చూస్తే సొంతంగా పార్టీ పెట్టుకొని నాలుగు సంవత్సరాల అనుభవం కూడా లేదు. కనీసం మంత్రి పదవి కూడా చేపట్టలేదు. ఓవైపు కుట్రలు.. కుతంత్రాలు, సొంత పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల‌కు పదవుల ఆశ చూపి అధికార పార్టీ బలవంతంగా లాగేసుకుంటుంది.. మరోవైపు ఎన్నో అవమానాలు వీటన్నింటినీ తట్టుకుని నిలబడిన అందుకే జగన్ మోహన్ రెడ్డికి ఏపీ ప్రజలు మొత్తం 175 స్థానాల్లో 151 చోట్ల తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. ఇదంతా ఒకటి రెండు రోజుల్లో సాధ్యం కాలేదు. నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర... మొత్తంగా రెండు సంవత్సరాల పాటు ప్రజల్లో ఉన్న వైనం... ప్రజల కష్టాలను కళ్లారా చూసి చ‌లించడంతో పాటు వాటిని పరిష్కరిస్తాన‌న్న‌ భరోసా సైతం ప్రజలు ఇవ్వ‌డం.. అటు జ‌గ‌న్‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌డంతోనే ఇవ‌న్నీ సాధ్య‌మ‌య్యాయి.

 

సీఎంగా యేడాది కూడా కాకుండానే ఎన్నో సంస్క‌ర‌ణ‌లు... ఆర్టీసీ ప్ర‌భుత్వంలో విలీనం.. మూడు రాజ‌ధానులు.. ఇంగ్లీష్ విద్య‌... మార్కెట్ క‌మిటీల్లో మ‌హిళ‌ల‌కు రిజర్వేష‌న్లు.. అమ్మ ఒడి.. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌.. గ్రామ స‌చివాల‌యాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక‌టా రెండా ఎన్నో రికార్డులు యేడాది కాలంలో జ‌గ‌న్‌కు ఉన్నాయి. ఇక స్థానిక ఎన్నిక‌ల్లో తిరుగులేని మెజార్టీ వ‌చ్చే స్తోంద‌నుకున్న టైంలో క‌రోనా జ‌గ‌న్ దూకుడుకు అడ్డు క‌ట్టేసింది. ఇక క‌రోనాను అడ్డు కునేందుకు జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాల‌కు జాతీయ స్థాయిలో ప్ర‌శంస‌లు వ‌చ్చాయి.

 

వ‌ల‌స కార్మికుల విష‌యంలో జ‌గ‌న్ నిర్ణ‌యాల‌కు దేశంలో మిగిలిన రాష్ట్రాల సీఎంల‌కే హ్యాట్సాప్ అంటున్నారు. మ‌రో వైపు తీవ్ర‌మైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి టైంలో కూడా జ‌గ‌న్ క‌రోనా కేసులు పెర‌గ‌కుండా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఇక విశాఖ ఎల్జీ పాలిమ‌ర్స్ ప్ర‌మాదంలో 12 మంది చ‌నిపోతే అస‌లు జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాలు దేశ వ్యాప్తంగా ఉన్న సీఎంలు... అధికారులే షాక్ అయ్యారు. కేవ‌లం రెండు రోజుల్లో ఈ స‌మ‌స్య గురించి ఎవ్వ‌రూ నోరెత్తేందుకు.. విమ‌ర్శ చేసేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌లేదు. ఇంత త‌క్కువ టైంలో ఇంత క్రేజ్ ఉన్న సీఎం దేశంలోనే ఎవ్వ‌రూ లేర‌న‌డంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: