ప్ర‌స్తుతం ఉన్న భార‌త‌దేశ ప‌రిస్థితుల్లో నెహ్రూలాంటి మ‌హానేత నాయ‌క‌త్వం ఎంతో అవ‌స‌ర‌మ‌ని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్య‌నించారు. మత రాజకీయాలకు తావులేకుండా దేశాన్ని ముందుకు న‌డిపే నాయ‌క‌త్వం కోసం ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నార‌ని అన్నారు.  హైదరాబాద్‌లోని తన నివాసంలో ఓ జాతీయ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం  విభజించు, పాలించు అనే ధోరణితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అన్నారు. ఇలాంటి రాజ‌కీయాల‌కు ఎక్కువ కాలం చెల్లుబాటు కావాని అన్నారు. 

 

 దేశ పునర్నినిర్మాణం, బహుళ ప్రయోజనాలతో కూడిన సరికొత్త విధానం  భార‌త్‌కు అవ‌స‌ర‌ముంద‌ని తెలిపారు. ఇక లాక్‌డౌన్ విష‌యంపై ఆయ‌న తీవ్రంగానే స్పందించారు. లాక్‌డౌన్‌ పొడిగించడంతో పేద‌లు ఆక‌లితో చ‌నిపోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రణాళికా రహితంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో నిరుపేదలు తిండికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని చెప్పారు. ఇక  కరోనా వ్యాప్తికి కేవలం ఒక వర్గానికి చెందిన ప్రజల్ని బాధ్యుల్ని చెయ్యడం బీజేపీ విభ‌జ‌న వాద రాజ‌కీయాల‌కు నిద‌ర్శ‌న‌మ‌ని ఆరోపించారు.


లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని..వారిని స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే లాక్ డౌన్ తర్వాత కొన్ని ఆర్థిక కార్యకలాపాలకు వెసులుబాటు కల్పించాలని.. సినిమా థియేటర్స్,మాల్స్‌,బహిరంగ సభలపై మాత్రం ఆంక్షలు కొనసాగించాలని చెప్పారు. కరోనా సంక్షోభం కారణంగా దేశంలో 10 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని.. కాబట్టి దాని పరిష్కారానికి ప్రధాని మోదీ ప్రత్యేక ప్రణాళికను సిద్దం చేయాలని డిమాండ్ చేశారు.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: