కరోనా వైరస్ ఎఫెక్ట్ కి కేంద్రం లాక్ డౌన్ విధించడంతో దేశంలో అనేక మంది వివిధ రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేద మధ్యతరగతి ప్రజలు ఆకలి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోపక్క వలస కూలీలు లాక్ డౌన్ వల్ల పనులు లేక సొంత ఇల్లు చేరటానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు నెలల నుండి లాక్ డౌన్ దెబ్బకి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఇంటిలోనే ఉండటంతో ఎక్కువగా EMI లు క్రెడిట్ కార్డు పర్సనల్ లోన్ లు, హోమ్ లోన్ లు తీసుకున్నవారు చెల్లింపుల విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో ముందుగానే ఈ విషయం కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో మే 31 వరకు ఆర్బీఐ మార‌టోరియం స‌దుపాయం క‌ల్పించిన విష‌యం అందరికీ తెలిసిందే.

 

అయితే వైరస్ ఇంకా ఉండటంతో మరియు ఉద్యోగాలు కంపెనీల విషయంలో ఓపెన్ చేసే అవకాశాలు ఇప్పుడప్పుడే లేకపోవటంతో EMI ల విషయం లో rbi మరో స్వీట్ ప్రకటన చేయటానికి రెడీ అవుతున్నట్లు అర్థమవుతుంది. అదేమిటంటే ఇచ్చిన సదుపాయాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించాలని ఆర్బిఐ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశంలో మే 31 వ తేదీ వరకు లాక్ డౌన్ ఇటీవల పొడిగించిన నేపథ్యంలో జూన్ నెల వరకు ఈఎంఐల‌ను చెల్లించే ప‌రిస్థితిలో ప్రస్తుతం ఎవరు లేరు. అందుక‌నే ఆర్‌బీఐ మార‌టోరియం స‌దుపాయాన్ని మ‌రో 3 నెల‌లు పొడిగించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది.

 

ఆర్‌బీఐ మార‌టోరియం స‌దుపాయాన్ని మ‌రో 3 నెల‌లు పొడిగిస్తే.. జూన్‌, జూలై, ఆగ‌స్టు.. నెలల్లో ఈఎంఐ, బిల్లు చెల్లింపులు చేయాల్సిన ప‌నిలేదు. తిరిగి సెప్టెంబ‌ర్‌లో వాటిని చెల్లించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో వాటికి అదనంగా వడ్డీ కూడా పడుతుంది. త్వరలోనే ఈ విషయాన్ని ఆర్బిఐ ప్రకటించేందుకు మొత్తం పరిశీలించి ఒక అభిప్రాయానికి వచ్చి అప్పుడు ప్రజలకు తెలియజేయాలని rbi ఆలోచిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: