డబ్బుల కోసం సొంత వాళ్ళనే కాదు కన్న వాళ్ళను కూడా చూడకుండా కిరాతకంగా చంపేసే రోజులు వస్తున్నాయి.. అయితే డబ్బు అనేది చాలా ముఖ్యమైనది అందుకే క్రైమ్ ఎక్కువగా జరుగుతున్నాయి.మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.150ల కోసం తలెత్తిన వివాదంలో ఓ వ్యక్తి స్నేహితుడి ప్రాణాలు తీశాడు. సౌత్ ముంబైలోని ఓ ప్రాంతంలో నివసించే భూషణ్ షేక్ అలియాస్ చుల్‌బుల్‌, రియాజ్‌ షేక్‌ స్నేహితులు. వీరిద్దరు భౌచా దక్కా చేపల మార్కెట్‌లో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. 

 

 

 

లాక్‌ డౌన్  కారణం గా పనిలేక కొద్ది రోజులు గా ఇళ్లకే పరిమిత మయ్యారు. లాక్ ‌డౌన్‌కు ముందు రియాజ్ తన ఫ్రెండ్ దగ్గరి నుంచి రూ.150 అప్పుగా తీసుకున్నాడు. శుక్రవారం చుల్‌బుల్ అతడి ఇంటికి వెళ్లి తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగివ్వాలని అడిగాడు. అయితే చాలా రోజులుగా పనిలేక పోవడంతో తన దగ్గర డబ్బులు లేవని, కొద్ది రోజుల తర్వాత ఇస్తానని రియాజ్ చెప్పాడు. శనివారం మరోసార అతడి ఇంటికి వెళ్లి చుల్‌ బుల్ డబ్బు కోసం ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తి ఘర్షణకు దారితీసింది. కోపోద్రిక్తుడైన చుల్‌బుక్ బండరాయితో రియాజ్‌ను తీవ్రంగా కొట్టి పరారయ్యాడు.

 

 

 

రక్తపు మడుగు లో పడి వున్న రియాజ్‌ ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు చుల్‌బుల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే కేవలం రూ.150 కోసం హత్య జరగడం స్థానికంగా కలకలం రేపింది.. లాక్ డౌన్ కఠినంగా కొనసాగుతున్న నేపథ్యంలో 150 సంపాదించడం కూడా కష్టంగా మారడంతో ఇలా హత్య చేసి ఉంటాడని చెప్పుకొచ్చారు..అతని మరణం ఆ ఏరియా ను విషాదంలో పడవేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి: