కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా దేశంలో అనేక మంది రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఊహించని విధంగా ఒక్కసారిగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజల జీవితాలలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవటంతో పేద మరియు మధ్యతరగతి ప్రజలు ఆకలి కేకలు పెడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా బయటకు వెళ్లలేని పరిస్థితి తో పాటు ఎక్కడికక్కడ అన్ని రంగాలు క్లోజ్ అవడంతో ఉద్యోగాలకి వెళ్లలేక, చేతిలో డబ్బులు లేక, ప్రతి చోటా చేయిచాచే పరిస్థితి ఏర్పడింది. వలస కూలీల అవస్థలు అయితే వర్ణనాతీతం. పొట్టకూటికోసం ఊరికని ఊరు వచ్చి లాక్ డౌన్ దెబ్బకి ఇరుకున్న పరిస్థితి ప్రతి చోట ఏర్పడింది.

 

చేయడానికి పని లేక మరోపక్క రవాణా వ్యవస్థ కూడా లేకపోవటంతో తిరిగి ఇంటికి చేరటానికి కాలిబాట నమ్ముకుని చాలామంది వేల కిలోమీటర్లు నడుస్తూ మధ్యలోనే చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే మూడో దశ లాక్ డౌన్ కేంద్రం పొడిగించిన సమయంలో వలస కూలీల కు ప్రత్యేకమైన ట్రైన్స్ దేశవ్యాప్తంగా నడిపి కొంత ఊరట ఇచ్చిన కేంద్రం తాజాగా మరో శుభవార్త చెప్పింది. కొన్ని రాష్ట్రాలలో వలస కార్మికులను రాష్ట్రంలో రాకుండా అడ్డుకుంటున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు కొత్త గైడ్ లైన్స్ ఇచ్చింది.

 

ఇక మీదట కార్మికుల తరలింపుపై రాష్ట్రాల అనుమతి అవసరం లేదని కేంద్ర స్పష్టం చేసింది. రాష్ట్రాల అనుమతి ఉంటేనే వలస కార్మికులను తరలించాలన్న పాత నిబంధనను తొలగించింది. అలాగే లాక్‌డౌక్‌ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కూలీల కోసం స్థానిక ప్రభుత్వాలు అన్ని సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేసింది. వలస కార్మికుల తరలింపు కోసం ప్రస్తుతం నడుపుతున్నా రైళ్ల సంఖ్యను పెంచాలని రైల్వేమంత్రిత్వ శాఖను కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: