కరోనా  వైరస్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం తాజాగా 20 లక్షల కోట్లతో ఆత్మ నిర్బర్  భారత్ అనే ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలు మధ్యతరహా పరిశ్రమలకు బ్యాంకుల ద్వారా లోను ఇచ్చి మరింత అభివృద్ధికి తోడ్పడే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు. అయితే మత్స్యకారులకు వివిధ కుల వృత్తుల, గిరిజన సంక్షేమం కోసం ఇచ్చే నిధులు హైవేల మరమ్మతుల కోసం ఇచ్చే నిధులు ఇవన్నీ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు. 

 


 ఈ నేపథ్యంలో మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రం ఒక వాదన వినిపించింది.. వీటికి సంబంధించిన నిధులను మా చేతికి ఇవ్వండి మేము  వివిధ పథకాల ద్వారా ప్రజలకు ఇస్తాం అంటూ తెలిపింది. అయితే ఇప్పుడు వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద వచ్చే నిధులను ఉచితాల కింద రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. అయితే  కేంద్ర ప్రభుత్వం తీరుపై కేసీఆర్ సర్కార్   తీవ్రస్థాయిలో తప్పుబట్టిన విషయం తెలిసిందే. కేంద్రం ఇచ్చినటువంటి ప్యాకేజీ వల్ల  ఎలాంటి ఉపయోగం లేదు అన్నట్టువంటివి కేసీఆర్ సర్కార్ వినిపించిన వాదన. 

 


 ఇక తాజాగా ఏపీ మంత్రి బుగ్గన కూడా ఇదే తరహా వాదన  వినిపించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు కనీసం పది పైసలు వచ్చేది లేదు అంటూ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వమే అన్ని చూడకుండా... రాష్ట్రాలకు కొంత మేర నిధులు కేటాయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద వాటిని ప్రజలకు ఇస్తామని చెబుతున్నాయి. ఈ విషయంలో కేంద్రం అంగీకరించనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కెసిఆర్ విమర్శలు చేస్తుండగా తాజాగా కెసిఆర్ తో పాటు జగన్ సర్కారు కూడా అదే వాదనను తెరమీదకు తెచ్చి విమర్శలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: