ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనలో తీసుకునే నిర్ణయాల విషయంలో దూసుకుపోతున్నారు. కరోనా వైరస్ కట్టడి చేయడంలో దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొని విధంగా నిర్ణయాలు తీసుకొని కేంద్ర పెద్దలనే ఔరా అనిపించాడు. వలస కార్మికుల విషయంలో వారికి అండగా ఉంటూ వారి కడుపు నింపి, బొబ్బలు కట్టిన కాళ్లకు చెప్పులు ప్రభుత్వం తరఫున ఇచ్చి మానవత్వం చాటిన జగన్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. ఇటువంటి సమయంలో తన పరిపాలనలో ప్రత్యేకంగా తనకి మరియు ప్రజలకు మాత్రమే కనెక్షన్ ఉండే విధంగా ముందు నుండి జగన్ చాలా జాగ్రత్తలు వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

 

సచివాలయం మరియు గ్రామ వాలంటీర్స్ ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు కనెక్షన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్న జగన్ తాజాగా తన టీం లోకి సలహాదారుడిగా మాజీ చీఫ్ సెక్రటరీ తన తండ్రి వైయస్ ఉన్న టైంలో కీలకంగా రాణించిన వ్యక్తి రమాకాంత్ రెడ్డి ని ఇప్పుడు తన సలహాదారుడిగా జగన్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో వైఎస్ఆర్ కి ఆత్మ గా పిలువబడే కెవిపి రామచంద్ర రావు కూడా జగన్ టీమ్ లోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కెవిపి సంగతి ఏమోగానీ రమాకాంత్ రెడ్డి మాత్రం జగన్ టీమ్ లోకి త్వరలో జాయిన్ అవ్వబోతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి.

 

ఇటీవల నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వం తరఫున ఆర్డినెన్స్ తీసుకువచ్చి తప్పించడంలో రమాకాంత్ రెడ్డి ఆలోచన ఇచ్చినట్లు కూడా వైసిపి పార్టీ లో టాక్ నడుస్తుంది. రమాకాంత్ రెడ్డి గతంలో వైయస్ జగన్ కి సపోర్ట్ గా చాలా సందర్భాలలో మాట్లాడటం జరిగింది. దీంతో కచ్చితంగా ఇది జగన్ టీం కి ఒక మంచి బెనిఫిట్ అని వైయస్ హయాంలో పని చేసిన కొంతమంది నాయకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: