దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత దేశం  అభివృద్దిలో పరుగులు పెడుతోంది.క్లిష్ట  పరిస్థితుల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. అయితే ప్రధానమంత్రి ఎన్ని గొప్ప సంస్కరణలు తీసుకు వచ్చిన ఎంత బాగా పాలన చేసినప్పటికీ... పాశ్చాత్య దేశాల మీడియా మాత్రం భారత్ ను  ఎప్పుడూ చులకనగా నే చిత్రీకరిస్తూ ఉంటుంది. అహంకార ధోరణి తో ఎప్పుడు మోడీ విధానాలను తప్పు పడుతూ కథనాలను ప్రచురిస్తూ ఉంటుంది. కానీ మొదటిసారి పాశ్చాత్యదేశాల మీడియా  కూడా మోడీ గురించి గొప్పగా చెప్పారు. 

 


 ప్రస్తుతం కరోనా వైరస్ లాంటి క్లిష్ట పరిస్థితులు సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ విజయవంతంగా భారత ప్రజలు అందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చి.. కరోనా  వైరస్ ను కంట్రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి తాజాగా న్యూయార్క్ టైమ్స్ ప్రధాని నరేంద్ర మోడీ గురించి పాజిటివ్ గా ఒక కథనం ప్రచురితం చేసింది. అదేంటంటే.. భారత దేశంలో మోడీ నాయకత్వాన్ని ఏకంగా 90% ప్రజలు ఆమోదిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. 

 

అంతే కాకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ... భారత ప్రజలు అందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చి సమన్వయం చేయడంలో విజయం సాధించారు అంటూ తెలిపింది. అయితే ఓ వైపు నరేంద్ర మోడీని డిప్యూటీ మేయర్గా భారతదేశంలో ప్రచారం చేస్తున్నప్పటికీ ఆయన ఒక మోటివేటర్ అన్న భావన ప్రజల్లో ఉంది అంటూ చెప్పుకొచ్చింది న్యూయార్క్ టైమ్స్. దీనిపై రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే... న్యూయార్క్ టైమ్స్ లాంటి మీడియా సంస్థలు కూడా ఇండియా గొప్పతనాన్ని ఒప్పుకోక తప్పలేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రపంచం భారతదేశాన్ని చూసే తీరు మారుతున్న సమయంలో ప్రస్తుతం కొందరు ఇది నచ్చని వాళ్ళు విపక్షాల  సమావేశం పెట్టి మనల్ని మనం అపహాస్యం చేసుకునేలా చేయడానికి రెడీ అవుతున్నారని మండిపడుతున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: