ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు చిన్నారులంతా జగన్ అంకులు సూపర్ అంటూ జై కొడుతున్నారు. జగన్ చేసిన పనితో ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంతకీ జగన్ ఏం చేశాడు అంటారా.. ఏపీలో వేసవి సెలవులను మరో 2 నెలలకు పైగా పొడిగించేశారు. సాధారణంగా జూన్ లో ప్రారంభం కావాల్సిన పాఠశాలలను ఏకంగా ఆగస్టు 3కు మార్చేశారు. ఇక ఇప్పుడు ఏపీలో ఆగస్ట్ 3న పాఠశాలలు తెరుచుకోబోతున్నాయన్నమాట.

 

 

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్‌ 3న రాష్ట్రంలోని పాఠశాలన్నీ ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నాడు-నేడు కార్యక్రమంపై సమీక్షంలో భాగంగా పాఠశాలల అభివృద్ధిపైనా సీఎం ఆరా తీశారు. జులై నెలా ఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడు-నేడు కింద అభివృద్ధి పనులు పూర్తిచేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు.

 

 

చిన్నారులు జగన్ కు జేజేలు కొట్టేందుకు మరో కారణం కూడా ఉంది. అదే రోజు అంటే.. ఆగస్టు 3న వైయస్‌ఆర్‌ విద్యా కానుక పథకం ప్రారంభించబోతున్నారు. దీని ద్వారా పిల్లలకు యూనిఫాం, పుస్తకాలు, బ్యాగ్, బెల్టు, షూ, సాక్స్‌లు ఇస్తారు. ప్రతి పాఠశాలలో 9 రకాల సదుపాయాలను కల్పించేందుకు రూ.456 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ను కూడా సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విడుదల చేశారు. జులై నెలాఖరు కల్లా అన్ని స్కూళ్లలో పనులు పూర్తి చేసే విధంగా ఆయా జాల్లా కలెక్టర్లు పనులపై ప్రతిరోజూ సమీక్ష చేయాలి సూచించారు.

 

 

ఎలాగూ... మరో రెండు నెలల వరకూ పాఠశాలలు ఓపెన్ కావు కాబట్టి ఈలోపు పాఠశాలల అభివృధి పనులు చేయబోతున్నారు. ఇందు కోసం సిమెంటు, ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. అందుకే ఏపీలో పిల్లలు జగన్ అంకుల్ కు జై అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: