ఏపీ సీఎం వైఎస్ జగన్ గ్రామస్తులకు అనేక గుడ్ న్యూస్ చెప్పారు. పల్లెలు బావుంటేనే రాష్ట్రం బావుంటుందని భావిస్తున్న వైఎస్ జగన్ ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాల లబ్దిదారులు ఎక్కువగా పల్లెల్లోనే ఉంటారు. అందుకే పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.

 

 

ఇక జగన్ వారికి చెప్పిన గుడ్ న్యూస్ ఏంటంటే.. గ్రామాల్లో ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు త్వరలోనే ఇస్తారట. దీనికి సంబంధించి మే 31 లోగా భూసేకరణ, ప్లాట్లను సిద్ధం చేయడంతో పాటు అన్ని పనులు పూర్తి చేస్తారట. ఇల్లు లేని నిరుపేద ఉండకూడదని, అర్హత ఉండి ఇంటి స్థలం ఇవ్వలేదనే మాట రాకూడదని సీఎం పట్టుదలగా ఉన్నారు. మే 21 వరకు ఇళ్ల పట్టాల దరఖాస్తు చేసుకోవచ్చని, మే 30 కల్లా వెరిఫికేషన్‌ పూర్తికావాలని అధికారులను సీఎం ఆదేశించారు.

 

 

ఇళ్ల పట్టాలకు సంబంధించి తుది జాబితా జూన్‌ 7న ప్రకటిస్తారు. ఇళ్ల పట్టాల కోసం రూ.4,436.47 కోట్లు విడుదల చేశారు. మరో శుభవార్త ఏంటంటే.. పల్లెటూళ్లలో సదుపాయాల కల్పన పర్యవేక్షణకు జిల్లాకు ముగ్గురు జాయింట్‌ కలెక్టర్లు నియమించారు. వీరిలో ఒక జేసీ రైతు భరోసా, రెవెన్యూ, రెండో జేసీ గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మూడో జేసీకి ఆసరా, వెల్ఫేర్‌ కార్యక్రమాలు చూస్తారు. జేసీల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ చేస్తారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు పథకాలు అందించాలని వీరికి సీఎం ఆదేశించారు.

 

 

గతంలో ఎవరూ ప్రభుత్వ కార్యక్రమాలపై ఇంత దృష్టి ఎప్పుడూ పెట్టలేదని, చరిత్రలో ఎప్పుడూ కూడా గ్రామంపై ఇంత శ్రద్ధ పెట్టలేదని, మన ప్రభుత్వం మొత్తం గ్రామ రూపురేఖలు మారుస్తుందని సీఎం అంటున్నారు. విలేజ్‌ క్లినిక్స్‌లో 24 గంటలూ ఏఎన్‌ఎం అందుబాటులో ఉంటారట. మద్యం వినియోగాన్ని బాగా తగ్గించేందుకే లిక్కర్‌ రేట్లు పెంచి.. మద్యం దుకాణాల సంఖ్య తగ్గించామంటున్నారు సీఎం జగన్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: