ఐఏఎస్, ఐపీఎస్.. చదువుకున్న చాలా మంది విద్యార్థుల కల ఇది. ఎందుకంటే.. నిత్యం ప్రజాసేవలో ఉండే ఉద్యోగాలు ఇవి. ప్రజలకు నిజంగా సేవ చేయాలంటే ఇంతకంటే మంచి ఉద్యోగాలు దొరకవు. అయితే చెప్పుకోవడానికి బాగానే ఉన్నా.. వీరికీ చాలా లిమిటేషన్స్ ఉంటాయి. పైనుంచి రాజకీయ నాయకుల ఒత్తిళ్లు వాటిలో ముఖ్యమైనవి. అవినీతిని అంతం చేయాలని.. అక్రమార్కులకు చెక్ చెప్పాలని కుర్ర ఐఏఎస్ లు, ఐపీఎస్ లు మంచి కసిమీద ఉంటారు.

 

 

కానీ అదే సమయంలో రాజకీయ జోక్యం వారి దూకుడుకు అడ్డుకట్ట వేస్తుంది. తరచూ ట్రాన్స్ ఫర్లు వారిని ఇబ్బంది పెడతాయి. అందుకే ఉద్యోగంలో చేరిన మొదట్లో ఉన్నంత కసి ఆ తర్వాత ఈ అధికారుల్లో కనిపించదు. అయితే సీఎం జగన్ మాత్రం .. కొందరు కుర్ర ఐపీఎస్ లను ఎంచుకున్నారట. వారి ద్వారా రాష్ట్రంలోని సీన్ మార్చాలని భావిస్తున్నారట. మరి ఇంతకీ ఈ ఐపీఎస్ లకు జగన్ అప్పగించబోతున్న బాధ్యతలు ఏంటి అంటారా..?

 

 

పవర్ లో ఉన్న రాజకీయ నాయకులకు ఆదాయ మార్గాలుగా ఇసుక, మద్యం మారిపోయాయి. అందుకే వాటిని కట్టడి చేసేందుకు.. ఈ అక్రమాలను అడ్డుకునేందుకు జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందట. ప్రత్యేకించి.. మద్యం అక్రమాలకు చెక్‌ పెట్టడానికి యువ ఐపీఎస్‌ అధికారులను సీఎం జగన్ తానే స్వయంగా ఎంపిక చేసుకున్నారట. ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పారు.

 

 

ఈ అధికారులు కసి కొద్దీ పని చేస్తే.. ఏపీలో ఇసుక, మద్యం మాఫియాలకు అడ్డుకట్ట పడినట్టే. ఇసుక, మద్యం అక్రమ రవాణాలను అడ్డుకోవాలని జగన్ బాగా పట్టుదలగా ఉన్నారు. మంచి కుర్ర ఐపీఎస్ లను ఎంపిక చేసారు. బాగానే ఉంది. కానీ వారిని అధికార పార్టీ నాయకులు సరిగ్గా పని చేయనిస్తారా.. తరచూ జోక్యం చేసుకోకుండా ఊరుకుంటారా.. చూడాలి మరి ఈ కొత్త ప్రయోగం ఎంత వరకూ సక్సస్ అవుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: