కరోనా వైరస్ రావటంతో దేశ వ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు లాక్ డౌన్ వల్ల ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం చాలా పటిష్టంగా లాక్ డౌన్ దేశంలో అమలు చేయటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ దెబ్బకి పేద మరియు మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తినటానికి తిండి లేకపోవటం మరియు ఉద్యోగానికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో బయటకు కూడా అడుగుపెట్టే పరిస్థితి లేని నేపథ్యంలో చాలా ఇబ్బందులు పేద మరియు మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యలను అధిగమించడానికి నివారణ చర్యలు స్టార్ట్ చేసింది. పీఎం కేర్ ఫండ్ పేరిట నిధులు కలెక్ట్ చేయడానికి రెడీ అవ్వటం మనకందరికీ తెలిసిందే.

 

ఈ సందర్భంగా ప్రధానమంత్రి సమయానికి దేశంలో ఉన్న ప్రముఖ క్రీడాకారులు, సినిమా యాక్టర్లు మరియు వ్యాపార వేత్తలు భారీ స్థాయిలో విరాళాలు ప్రకటించారు. కొంతమంది కంపెనీ తరఫున మరికొంతమంది చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అదేవిధంగా మరికొంతమంది వ్యక్తిగతంగా విరాళాలు ప్రకటించడం జరిగింది. ఇదిలా ఉండగా భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త అపర కుబేరుడు విప్రో అజీమ్ ప్రేమ్జీ ప్రధానమంత్రి సహాయ నిధికి ఇచ్చిన విరాళం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వెళ్ళాలని ఫోర్బ్స్ తెలిసింది.

 

కరోనా వైరస్ కారణంగా ప్రధానమంత్రి సహాయ నిధికి ప్రేమ్జీ రూ.1125 (132 మిలియన్లు) కోట్లు ప్రకటించారు. కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బందికి సహాయం కోసం ఈ మొత్తం ప్రకటించారు. ఈ మొత్తంలో అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ రూ.1000 కోట్లు విప్రో రూ.100 కోట్లు విప్రో ఎంటర్ప్రైజెస్ రూ.25 కోట్లు ఇచ్చింది. రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఉన్నారు. ఇక ఆ తర్వాత కొన్ని కంపెనీల అధినేతలు అపార కుబేరులు పేర్లు నమోదు అయ్యాయి. తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన కరోనా వైరస్ విరాళాల విషయంలో మాత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ విరాళం ప్రకటించిన మూడో స్థానంలో అజీమ్ ప్రేమ్జీ స్థానం సంపాదించుకున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: