ఆకలి మనుషులకు ఎలాగో ప్రతి జీవికి అలాగే ఉంటుంది.. దీనికి పేద వాడు, ధనికుడు అనే తేడా లేదు.. జంతువు, పక్షి అనే తారతమ్యం లేదు.. ఈ ప్రపంచంలో కులం మతం, చిన్నా పెద్దా అనే భేదాలు ఏవి ఎరుగకుండా తనపని తాను చేసుకుంటున్న ఆకలి అంటే అందరు అల్లాడవలసిందే.. సమయానికి కడుపులోకి దిగకుంటే గుడ్లు తేలేయవలసిందే.. అయితే ఈ ఆకలి మనిషికి ప్రాణం పోస్తుంది, అదే ప్రాణం తీస్తుంది.. డబ్బులేకుండా, రోగం వచ్చినా ఎలాగో కిందా మీదా పడి బ్రతకవచ్చూ.. కానీ ఆకలి తీర్చుకోకుండా బ్రతకడం చాలా కష్టం.. అయితే ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా అనే వ్యాధివల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటుంది..

 

 

అదీగాక చాలా రోజులుగా ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌డౌన్ కూడా అన్ని దేశాల ప్రభుత్వాలు అమలు చేశారు.. ఇలాంటి పరిస్దితుల్లో ఆహారం తీసుకున్న వారు బ్రతికారు.. అది లేకుండా ఆకలితో పేదవారు మరణించారు.. ఇక ఈ ఆకలి బారిన మనుషులే కాదు, జంతువులు, పక్షులు కూడా పడ్డాయి.. వాటికి కూడా ఆహారం పెట్టే వారు కరువైయ్యారు.. ఎందుకంటే ఈ మూగజీవాల వేదన ఎవరికి అక్కరలేదు కదా.. ఇకపోతే యూపీలోని కాన్పూర్‌లోగ‌ల‌ కాకాదేవ్ ప్రాంతంలో ఆకలితో అల్లాడిపోతున్న వీధి కుక్కలు ఒక మ‌హిళ‌పై దాడిచేసి చంపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది..

 

 

ఎప్పుడు దాడి చేశాయో గానీ, ఆ మృతదేహాన్ని చిందరవందరగా చేసిన కుక్కలు, అలాగే రోడ్డు ప‌క్క‌న వదిలేసి వెళ్ళాయి.. ఇక పెట్రోలింగ్‌కు వెళ్ళిన పోలీసులు ఆ మృతదేహాన్ని కనుగొన్నారు వెంటనే శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి త‌ర‌లించారు. కాగా గత రెండు నెలలుగా అమలవుతున్న లాక్‌డౌన్ కారణంగా ఈ ప్రాంతంలోని వీధి కుక్కలకు ఆహారం లభించడం లేదని గీతానగర్ ప్రాంత ప్రజలు తెలిపారు. ఇలాంటి పరిస్దితిలో ప్ర‌భుత్వం కూడా వీటి గురించి ప‌ట్టించుకోవ‌డం లేదు..

 

 

అయితే వాటి ఆకలి తీరక కుక్క‌లు మనుషులపై దాడులు చేస్తున్నాయ‌ని తెలిపారు. ఒక మనిషిని పీక్కుతిన్న తర్వాత అధికారులకు సృహ వచ్చినట్లు ఉందనుకుంటా.. అందుకే వెంటనే స్పందించిన ఇక్కడి  మున్సిపల్ కమిషనర్‌కు డిఎం బ్రహ్మదేవ్ రామ్ తివారీ, ప‌ట్ణణంలోని మూగజీవాల‌కు ఆహారం అందించాలని అధికారుల‌ను ఆదేశించారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: