ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం ఇచ్చారు. నిన్న సీఎం జగన్ కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగన్ రాష్ట్రంలో అర్హులు ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోతే వారికి మరోసారి అవకాశం ఇవ్వాలని అధికారులకు సూచించారు. వారికి 15 రోజులు సమయం ఇచ్చి దరఖాస్తులు తీసుకోవాలని చెప్పారు. 
 
దరఖాస్తులను పరిశీలించిన అనంతరం గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు పెట్టాలని ఆదేశించారు. నిన్న జగన్ పేదలకు ఇళ్ల పట్టాల స్థలాలు, హౌసింగ్, నాడు - నేడు కార్యక్రమాలు, ఖరీఫ్ సీజన్ లో వ్యవసాయం, తాగునీరు, ఉపాధి హామీ, కరోనా నివారణ చర్యల గురించి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జులై 8వ తేదీన వైయస్సార్ జయంతి సందర్భంగా ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుందని చెప్పారు. 
 
జగన్ జూన్ 7వ తేదీలోగా తుది ఇళ్ల స్థలాల లబ్ధిదారుల జాబితా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే భూములు కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. ఇళ్ల పట్టాలతో పాటు పలు కీలక విషయాల గురించి సీఎం జగన్ అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో నకిలీ పురుగు మందులు, కల్తీ విత్తనాలు కనిపించకూడదని అధికారులు చెప్పారు. జూన్ 1వ తేదీ నుంచి రైతుభరోసా కేంద్రాలతో గ్రామాల్లో పంపిణీకి చర్యలు చేపట్టాలని అన్నారు. 
 
వలస కూలీలకు ఉపాధి హామీ పనులు బాగా కల్పించాలని... ఐఏఎస్ లు బాగా పని చేస్తేనే రాష్ట్రానికి మంచి పేరు వస్తుందని చెప్పారు. జాయింట్ కలెక్టర్ల పనితీరును పర్యవేక్షిస్తామని అన్నారు. ప్రభుత్వానికి ఓటు వేయని వారు అయినా అర్హత ఉంటే పథకాలు అందజేయాలని సూచించారు. జగన్ మేనిఫెస్టోలోని పథకాల అమలుకు తేదీల వారీగా క్యాలెండర్ ను ప్రకటించారు. జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లు తేదీల ప్రకారం క్యాలెండర్ ను అమలు చేయాలని సూచించారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: